నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, శరణ్యలు కూడా మెప్పించారు. శుక్రవారం రిలీజైన గ్యాంగ్ లీడర్ మంచి టాక్ తో దూసుకెళ్తుంది. 


ఈ ఇయర్ జెర్సీ తో హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి నుండి నాని ఈ సినిమా మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఆఫ్టర్ రిలీజ్ నాని మాటే నిజమైంది. ఇక ఈ సినిమా తర్వాత నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. 


'V' టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. 'V' సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. 'V' తర్వాత నాని మరోసారి తనకు హిట్ ఇచ్చిన దర్శకుడిని రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అతనే శివ నిర్వాణ. నానితో నిన్నుకోరి సినిమా తీసి హిట్ అందుకున్న శివ నిర్వాణ మరోసారి నానితో సినిమాకు సిద్ధమయ్యాడు. నిన్నుకోరి తర్వాత మజిలీతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్వాణ. మరో సూపర్ సబ్జెక్ట్ సిద్ధం చేసుకున్నాడట. 

ఎలాగు నిన్నుకోరి కలిసి పనిచేశారు కాబట్టి నాని శివ నిర్వాణ కాంబో మూవీ మరో సూపర్ హిట్ అవడం ఖాయం. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న 'V' సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శివ నిర్వాణ సినిమా త్వరలో మొదలై 2020 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మొత్తానికి కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు అంతగా ఆడకపోయినా జెర్సీతో నాని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: