మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక్కో సినిమాకు ప్రత్యేకతను చూపించడమే కాదు నటనలో బాగా వేరియోషన్స్ చూపిస్తున్నాడు వరుణ్ తేజ్. భిన్నమైన సినిమాల్ని ట్రై చేస్తూ.. తన సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న భరోసాను నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తున్నాడు. రీసెంట్‌గా ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు 100 కోట్ల మార్కెట్ లోను చేరడు. ఇక వరుణ్ తాజాగా నటించిన సినిమా వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ కు తెలుగులో రీమేక్ గా తెరకెక్కించారన్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. టీజర్ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. వాస్తవానికి గత వారమే విడుదల కావాల్సిన ఈ సినిమా నాని గ్యాంగ్ లీడర్ మూవీ రిలీజ్ తో క్లాష్ కావటం.. నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా సెప్టెంబరు 20న విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ ను పెంచిన వరుణ్ తేజ్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

ఒకసారి తన స్నేహితులతో కలిసి ఒక ఫంక్షన్ కు వెళ్లానని.. కొంతమంది స్నేహితులం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకుందన్నారు. అంతలోనే చెంప మీద ముద్దు పెట్టుకొని వెళ్లిపోయిందని..  ఇదంతా క్షణాల్లోపే జరిగిపోయినట్లు ఈ సీక్రెట్ ను బయట పెట్టాడు. అది జరిగిన వెంటనే అందరి ముందు ఇబ్బందిగా అనిపించిందని.. సిగ్గుగా అనిపించినట్లు చెప్పాడు. నిజంగా అవకాశం ఉండాలే గాని వరుణ్ ని అలా దొంగ చాటుగా ముద్దు పెట్టుకోవడానికి ఎంతమంది క్యూలో ఉన్నారో చెప్పలేము. అసలే మెగా హీరో కదా సాధారణమైన అమ్మాయిలే కాదు సెలబ్రిటీస్, హీరోయిన్స్ కూడా ఉంటారు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: