ఓంకార్ డైరక్షన్ లో రాజు గారి గది 3 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. OAK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓంకార్ స్వయంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 


ఈవెంట్ లో భాగంగా దర్శక నిర్మాత ఓంకార్ అవికా గోర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. జూన్ 21న మొదలు పెట్టిన ఈ సినిమా జూలై, ఆగష్టు నెలల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి ట్రైలర్ తో మీ ముందుకు వచ్చామని అన్నారు ఓంకార్. రాజు గారి గది 1లో సూపర్ కామెడీ ఉంటుంది. రాజు గారి గది 2లో అది మిస్సైంది. అందుకే రాజు గారి గది 3లో మంచి కథతో పాటుగా కామెడీ కూడా పెట్టామని అన్నారు ఓంకార్.  


అయితే హీరోయిన్ అవికా గోర్ గురించి చెబుతూ ఎలాంటి హెడ్ వెయిట్ లేకుండా ఆమె ఈ సినిమా చేసిందని అన్నారు. అయితే ఈ కామెంట్స్ డైరెక్ట్ గా తమన్నాని ఉద్దేశించి ఓంకార్ అన్నాడని కామెంట్స్ వస్తున్నాయి. రాజు గారి గది 3 సినిమా ముహుర్తం రోజు హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా పాల్గొన్నది. అయితే మధ్యలో ఏమైందో ఏమో కాని తమన్నా ఆ సినిమా నుండి బయటకు వచ్చేసింది.  


తమన్నా సినిమా నుండి బయటకు వచ్చింది రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల అన్నారు కాని అసలు విషయం ఏంటంటే షూటింగ్ లో పాల్గొన్న కొద్దిరోజుల్లోనే తమన్నా డైరక్టర్ ఓంకార్ కు చుక్కలు చూపించిందట. ఇలానే కొనసాగితే షూటింగ్ నడిపించడం కష్టమని ఆమెని వద్దనుకున్నారట. అందుకే ప్రత్యేకంగా అవికా గోర్ విషయంలో ఎలాంటి హెడ్ వెయిట్ లేకుండా చేసిందని చెప్పాడు. అంటే మూడు సినిమాల దర్శకుడు కదా అని ఓంకార్ దగ్గర తమన్నా బిల్డప్ ఇచ్చి ఉండొచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: