ఎన్టీఆర్‌గారితో నా దేశం చిత్రం  చేశాను. ఆయ‌న నిర్మాత దేవివ‌ర‌ప్ర‌సాద్‌గారు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ప‌డుతున్నారు. ఆ సినిమా హిందీ వెర్ష‌న్ లావారిస్‌లో ఒక కీల‌క పాత్ర‌ను సురేష్ ఓబ‌రాయ్ చేశారు. దాన్ని ఓ యంగ్ హీరోతో చేయించాల‌నుకున్నారు. అప్పుడు నన్ను అడిగారు వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం ఇష్టంలేక ఒప్పుకున్నాను. ఆ సినిమా త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు. అప్పుడు ఆయ‌న ఒకే ఒక్క‌మాట అన్నారు. సారీ బ్ర‌ద‌ర్ నా నిష్క్ర‌మ‌ణ‌, నీ ఎంట్రీ ఒకేసారి జ‌రిగాయి. నీ బ్యాడ్ ల‌క్ అని అన్నారు.  ఒక‌ప్పుడు హీరోగా రాణించి, నిర్మాత‌గా చాలా మంచి సినిమాలు తీసి, త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స్థిర‌ప‌డ్డ ఆయ‌న కొంత‌కాలంగా చాలా త‌క్కువ‌గా మాత్ర‌మే సినిమాల్లో క‌నిపిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 15న ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇండియా హెరాల్డ్‌తో ప్ర‌త్యేకంగా సంభాషించిన విశేషాలు...


చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దివిన విద్యా విధానం క్ర‌మ‌శిక్ష‌ణ ఎలా వ‌చ్చింది?
నాకు చాద‌స్త‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే నేను మిల‌ట‌రీ ఏరియా నుంచి వ‌చ్చాను. నేను చిన్న‌ప్ప‌టి నుంచి పెరిగిన వాతావ‌ర‌ణం అంతా మిల‌ట‌రీ వాతావ‌ర‌ణంలో పెరిగాను. చ‌దివిన స్కూల్ అంతా అదే. మా నాన్న‌గారు మా చిన్న‌ప్పుడే మిల‌ట‌రీ నుంచి వ‌చ్చేశారు. మేము హైద‌రాబాద్ వ‌చ్చి దాదాపు అర‌వైరెండేళ్లు అయింది. అలా పెర‌గ‌డం వ‌ల్ల నాకు సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. అందువ‌ల్ల నాకు ఎవ‌ర‌న్నా ఆబ‌ద్దాలాడినా నాకు చాలా కోప‌మొచ్చుద్ది.  నా మైన‌స్‌లు నాకు తెలుసు కాబ‌ట్టి నేనే ఇండ‌స్ట్రీకి ఒక్క అడుగు దూరంగా ఉంటాను. అలాగే పంచువాలిటీని మెయిన్‌టెయిన్ చేస్తా. టైం టు టైం ఉంటాను.నా న‌ల‌భైఏళ్ళ కెరియ‌ర్‌లో షూటింగ్‌కి ఒక్క‌రోజుకూడా 30 సెక‌న్లు కూడా లేటుగా వెళ్ల‌ను. టైం అంటే టైంకి వెళ‌తాను. దాదాపుగా మ‌న‌వాళ్ళంద‌రూ నిజాల‌క‌న్నా ఆబ‌ద్దాలు ఎక్కువ‌గా మాట్లాడ‌తారు. ఒక‌ప్పుడు అలా ఉండేది కాదు ఇప్పుడు బాగా ఎక్కువ‌యింది.
మీరున్న‌ప్పుడు ఇండ‌స్ట్రీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది?
ఒకే ఒక్క అదృష్టం ఏమిటంటే స్వ‌ర్ణ‌యుగం చివ‌ర్లో కొంచం చూశాం. స్వ‌ర్ణ దాదాపు 80,85లో అయిపోయింది.నేను, చిరంజీవిగారు. త‌ర్వాత వ‌చ్చిన సుమ‌న్ కొద్దిగా చూశాం. త‌ర్వాత పూర్తిగా మారిపోయింది. దాని పైన ప్ర‌త్యేకించి కామెంట్లు చెయ్య‌కూడ‌దు ఎందువ‌ల్ల‌నంటే కాలం మారింది దాంతోపాటు మ‌నం కూడా మారాలి. మార‌క‌పోతే మ‌నం స‌ర్‌వైవ్ కాలేం. అలా అని చెప్పి మ‌న అభిమానాన్ని చంపుకోలేం. చాలామంది న‌న్ను ఇప్ప‌టికీ అడుగుతుంటారు. నీకు ఇంత ఎన‌ర్జీ ఉంది ఇప్ప‌టికీ మంచి యాక్టివ్‌గా ఉన్నావ్ సినిమాల్లో చెయొచ్చు క‌దా అని. చేస్తాను నాకు త‌గ్గ పాత్ర‌లు వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను. అలా అని దానికోసం దిగ‌జారిపోయి కాళ్ళుప‌ట్టుకోవ‌డం లాంటి ప‌నులు చెయ్య‌ను. 


ఇండ‌స్ట్రీ ఇలా మార‌డానికి కార‌ణం ఏంటి? జ‌న‌రేష‌న్ మార్పా?
గ్రూప్స్ ఎక్క‌వ‌యిపోయాయి. ఒక‌ప్పుడు అలా ఉండేది కాదు ఒక్క‌టే గ్రూపు అది సినిమా గ్రూపు. అప్ప‌ట్లో మ‌ద్రాస్‌లో త‌మిళ రాష్ట్రంలో అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఉండేవారు. ఇప్పుడు ఆ యూనిటీ లేదు. ఒక‌ప‌క్క నేను హీరోగా షూటింగ్ చేసేవాడ్ని ఇంకొంచం దూరంలో మ‌హాన‌టుడు షూటింగ్ జ‌రిగేది. మ‌రోప‌క్క రాజ్‌కుమార్ ఉండేవారు. ఆ రోజులు మ‌ళ్ళీ రావు.


మీరు ఎప్పుడైన వాళ్ళ‌తో క‌లిసి న‌టించారా?
నేను ఆ లాంగ్వేజ్‌లో చెయ్య‌లేదు. తెలుగులో నాగేశ్వ‌రావు త‌ప్పించి మొగ‌తా లెజండ‌రీ యాక్ట‌ర్స్ అంద‌రితోనూ దాదాపుగా క‌లిసి న‌టించాను. రామారావుగారు, ప్ర‌భాక‌ర్‌రెడ్డి, గుమ్మ‌డి అస‌లు చెయ్య‌నివాళ్ళంటూ ఎవ్వ‌రూ లేరు. 


రామారావుగారితో చేసిన‌ప్పుడు ఆయ‌న నుంచి మీరు నేర్చుకున్న‌ది?
నేర్చుకోవ‌డం అంటే నేను ప‌క్క క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న కుటుంబం నుంచి వెళ్ళ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు నేను చాలా బాగా న‌చ్చేశాను. ఎందువ‌ల్ల నంటే ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌లో మాస్ట‌ర్ కావ‌డంతో ఆయ‌న‌కు బాగా న‌చ్చాను. నేను ఏ రోజు డ్రామాలు చెయ్య‌లేదు. నేను స్టేజ్ ఆర్టిస్ట్‌ని కాదు. హైద‌రాబాద్‌లో పెర‌గ‌డం వ‌ల్ల  ఆ రోజుల్లో స్కూల్లో తెలుగు అస‌లు చెప్పేవారు కాదు. బ్రహ్మానంద‌రెడ్డిగారు చీఫ్‌మినిస్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు తెలుగు కూడా కాన్వెంట్‌లో చెప్పాలి అని రూల్ పెట్ట‌డంతో అప్పుడు తెలుగు చెప్పారు.  నేను ఇండ‌స్ట్రీకి రావ‌డానికి ఇవ‌న్నీ నాకు మైన‌స్ పాయింట్‌లు అనే చెప్పాలి. 


ఇండ‌స్ట్రీకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంటి?
నాకు చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్ గారంటే ఎన‌లేని అభిమానం. కేవ‌లం ఆయ‌న స్ఫూర్తి వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చాను. అంత‌కు మించి వేరే కార‌ణం లేదు. నాకు బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎవ‌రూ లేరు. మాది బిజినెస్ ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు డాక్ట‌ర్ చ‌ద‌వాల‌ని కోరిక ఉండేది. అందుకే నేను ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర్వాత సైన్స్ తీసుకున్నాను. కేవ‌లం రెండు మార్కుల్లో పోయింది.గుల్‌బ‌ర్గా అంతా మా నాన్న‌గారు ట్రై చేశారు కాని నాకు సీటు రాలేదు. నాకు అప్ప‌ట్లో రెండే రెండు అంశాల మీద ఆస‌క్తి ఉండేది. ఒక‌టి అయితే డాక్ట‌ర్ అవ్వాలి లేదా సినిమాలు అనుకున్నా. మెడిసిన్‌రాలేదు కాబ‌ట్టి తాప‌త్ర‌య ప‌డ‌కుండా. అప్పుడు ఒక‌ళ్ళ స‌ల‌హా ద్వారా వేజ‌ర్ల వెంక‌టేశ్వ‌రావుని ప‌రిచ‌యం చేశారు. వీళ్ళంతా డ్రామా పిచ్చి. అలా వాళ్ళ వెనుక రెండు సంవ‌త్స‌రాలు తిరిగాను. ఎక్క‌డి నుంచో స్కూట‌ర్ వేసుకుని ఖైర‌తాబాద్ వ‌చ్చేవాడ్ని. నువ్వేం సినిమాలు చేస్తావు అని అప్పుడ‌ప్పుడు న‌న్ను ర‌వీంద్ర‌భార‌తి తీసుకువెళ్ళి డ్రామాలు, నాట‌కాలు చూపించేవారు. అప్ప‌ట్లో ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రావుగారు ఏజీ ఆఫీస్‌లో ప‌నిచేసేవారు. వేజ‌ర్ల‌గారు ఆయ‌న మంచి స్నేహితులు అప్పుడు ఆయ‌న ఏదో సినిమా తియ్యాల‌ని అనుకునేవారు వాళ్ళు రోజు క‌లిసేవారు నేను కూడా వాళ్ళ‌తో రోజు క‌లిసేవాడ్ని అప్పుడు నా వ‌య‌సు 22ఏళ్ళు వాళ్లంతా నాకంటే పెద్ద‌వారు 35ఏళ్ళు ఉంటాయి. ప‌దిమంది పార్ట‌న‌ర్స్ క‌లిసి చ‌లిసీమ అని సినిమా మొద‌లుపెట్టారు. ఒకొక్క‌ళ్లు ప‌దివేలు, ఇర‌వైవేలు వేసుకునేవారు. ఒక ల‌క్ష‌లో సినిమా తియ్యాల‌నుకుంటున్నాం అన్నారు. నేను వెళ్లి వాళ్ల మ‌ధ్య‌లో మొత్తం సినిమా నేనే తీసేస్తాను నాకు పార్ట్‌న‌ర్స్ వ‌ద్దు అన్నాను. వాళ్లు న‌న్ను చూసి న‌వ్వారు. నువు కావాలంటే పార్ట్‌న‌ర్‌గా జాయిన్ అవ్వ‌మ‌న్నారు. అప్ప‌ట్లో ఒక‌ల‌క్ష్ తొంబైవేల‌లో సినిమాను తీశాం. ఆ సినిమా ఇంటికి వెళిపోతున్న నూత‌న్ ప్ర‌సాద్‌లైఫ్‌. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. అందులో నేను కూడా డ‌బ్బులు పెడుతున్నాను క‌దా అని నేను అందులో చిన్న పాత్ర కూడా చేశాను. దాంతో బానే ఉంది అనిపించింది. అప్పుడు వ‌రంగ‌ల్‌లో నా ఫ్రెండ్స్ రెండు సినిమాలు ఆగిపోతే నేనే ఫినిష్ చేశాను.  నాకు  ఫిల్మి అంటే ఏంటి, అవుట్‌డోర్ అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి ఎంత ఖ‌ర్చు అవుతుంది అని తెలుసుకోవ‌డానికి ఎక్స్‌పీరియ‌న్స్ కోసం చేసేవాడ్ని. అందులో ఒక సినిమా నిజం అప్ప‌టికి మూడు సినిమాలు అయిపోవ‌డంతో ఎక్స్‌పీరియ‌న్స్ వ‌చ్చింది. నేనే సోలోగా మా బావ‌గారు నేను మ‌రో మ‌లుపు తీశాను. ఆ సినిమాలో హీరో సాయిచ‌ర‌ణ్‌.  ప‌రుచూరి గోపాల్‌కృష్ణ‌గారు అప్ప‌ట్లో ఇక్క‌డ ప‌ని చేసేవారు ఆయ‌న ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. ఆయ‌న రెండు సీన్లు రాశారు. న‌న్ను హీరోగా అనుకున్నారు. కాని నేను ఈ రెండు సీన్లు చేస్తాన‌న్నా దాంతో వాళ్లు 11 సీన్ల‌కు లాగారు. అదిఒక సెన్షేష‌న‌ల్ హిట్ అయింది.  రివ‌ల్యూష‌న్ క్యారెక్ట‌ర్‌తో నిల‌బ‌డ్డాను. 


ఎన్టీఆర్ గారితో ఏం చేశారు?
ఎన్టీఆర్‌గారితో నా దేశం చేశాను. ఆయ‌న దేవివ‌ర‌ప్ర‌సాద్‌గారు త‌ర్జ‌న బ‌ర్జ‌న ప‌డుతున్నారు. హిందీలో ఆ చిత్రం లావాయిష్ సురేష్ ఓబ్‌రాయ్ చేశారు. వాళ్లు యంగ్ హీరోని కుర్రోడ్ని పెట్టాల‌ని చూశారు. రామారావుగారు జీవిత త్యాగం చెయ్యాలి. అప్పుడు నన్ను అడిగారు. వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం ఇష్టంలేక ఒప్పుకున్నాను. ఆయ‌న వెళ్ళిపోతూ ఒకేఒక్క‌మాట అన్నారు. సారీ బ్ర‌ద‌ర్ నా నిష్క్ర‌మ‌ణ నీ ఎంట్రీ ఒకేసారి జ‌రిగాయి. నీ బ్యాడ్ ల‌క్ అని అన్నారు. 


ఆయ‌న‌కి మీరు అభిమాని అని చెప్పారా?
తర్వాత త‌ర్వాత చెప్పుకొచ్చాను. ఆయ‌న ఎంత మ‌హానుభావుడంటే ఆయ‌న పార్టీ పెట్టిన‌ప్పుడు సినిమా ఇండ‌స్ట్రీ నుంచి ఒక్క‌రు కూడా ఎవ్వ‌రూ స‌పోర్ట్ చెయ్య‌లేదు. ఒక్క‌ళ్ల‌ద‌గ్గ‌ర రూపాయి కూడా తీసుకోలేదు. నా ఒక్క‌డి ద‌గ్గ‌రే ఐదువేలు తీసుకున్నాడు.  ముందు తీసుకోనంటే తీసుకోన‌న్నాడు. నేను సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పాడ‌యిపోయానండీ  నేను కేవ‌లం మీ కోసం మాత్ర‌మే వ‌చ్చాను. నేను న‌టుడ్ని అవ్వ‌డం ఏంటి నేను మీ అభిమానిని అని ఇచ్చాను. అది కూడా అయిస్టంగా తీసుకున్నాడు. దాంతో ఆయ‌న బ్ర‌ద‌ర్ నేను ఎవ్వ‌రికీ కూడా ఆఫ‌ర్ చెయ్య‌డం లేదు మీకు ఎమ్మెల్యేగా ప‌ద‌వి ఇస్తున్నాను అన్నారు. వెంట‌నే నేను గురువుగారు నాకు ఇంకా సినిమాల పైన మ‌క్కువ తీర‌లేదు. క‌నీసం యాభై సినిమాల‌న్నా తీసి వ‌స్తాను అన్నా దాంతో ఆయ‌న  న‌వ్వుకున్నారు. ఆయ‌న చీఫ్ మినిస్ట‌ర్ అయ్యాక కూడా తెల్ల‌వారుజామున ఐదు గంట‌కి ఫోన్ చేసేవారు. 


మీ ఇద్ద‌రి మ‌ధ్య అంత అనుబంధం ఉందా?
చాలా ఉంది. ఆయ‌న‌తోటి న‌టించ‌డం అంటే పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌నే చెప్పాలి. నాకు ఆయ‌న‌తో న‌టించ‌డం అనేది చివ‌రి ద‌శ‌లో అవ‌కాశం వ‌చ్చింది. నేను ఉండి ఉంటే ఖ‌చ్చితంగా నిన్ను ఎక్క‌డికో తీసుకువెళ్లేవాడ్ని అని అన్నారు. 


ఎక్క‌డికో అనేది ఎమ్మెల్యే సీట్‌ని అంగీక‌రించి ఉంటే బావుండేదిగా?
ఆయ‌న పార్టీ పెట్ట‌కుండా ఉండి ఉంటే న‌న్ను ఎన్ని సినిమాల‌కు తీసుకువెళ్లేవాడో. ఆ త‌ర్వాత కాస్త విరామం తీసుకుని మోహ‌న్‌బాబుతో మేజ‌ర్ చంద్రకాంత్ లో న‌టించారు. అప్ప‌ట్లో చాలా గ్యాప్ వ‌చ్చి నేను చాలా దూర‌మ‌య్యాను ఆయ‌న‌కి క‌న‌ప‌డ‌లేదు. ఆయ‌న‌తో నేను రిహార్సిల్ లేకుండా కూడా చేశాను. అన్నీ సింగిల్ టేక్ సీన్లే. ఈ వ‌య‌సులో నువ్వు డ్రామా అనుభ‌వం కూడా లేకుండా ఎలా చేస్తున్నావ్ అని మెచ్చుకునేవారు. కాని నా మైన‌స్‌లు నాకు తెలుసు అవుట్ డోర్ షూటింగ్‌లు ఉంటే ముందు రోజు సీన్ పేప‌ర్లు తీసుకుని రాత్రి రెండు గంట‌ల వ‌ర‌కు బాగా బ‌ట్టీ ప‌ట్టేద్దాన్ని ఆ త‌ర్వాత తిరిగి రెండు గంట‌లు ప‌డుకుని మ‌ళ్లీ నాలుగు గంట‌ల‌కు లేచి తిరిగి బ‌ట్టీ ప‌ట్టేవాడ్ని అలా ఎంతో క‌ష్ట‌ప‌డేవాడ్ని. అవుట్‌డోర్‌లో ఫూల్ అవ్వ‌కూడ‌ద‌ని క‌ష్ట‌ప‌డేవాడ్ని. ఆ క‌ష్టం నాకు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చింది. కాని దాని వెనుక రాత్రిళ్లు చాలా క‌ష్ట‌ముండేది. 


అప్ప‌ట్లో ఎన్టీఆర్ కూడా అలా చేసేవార‌ట పెద్ద డైలాగ్స్ ఉన్న‌ప్పుడు?
అంటే వాళ్లు తెలుగు మీడియం నుంచి వ‌చ్చిన వాళ్లు నాకు తెలుగు రాదు ఇంగ్లీషు మీడియం. దానికి తోడు వాళ్లు డ్రామాఆర్టిస్టులు. నేను ఎప్పుడూ స్టేజ్ ఎక్కి ఎరుగ‌ను. నాకు అవే పెద్ద మైన‌స్‌లు. ఎవ్వ‌రున్నా న‌న్ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేవారు. ఏం సింగిల్ టేక్ దానికోసం రాత్రిళ్ళు చాలా క‌ష్ట‌ప‌డేవాళ్ళం. 


ఇలా చెయ్య‌మ‌ని ఫ్రెండ్స్ ఏమ‌న్నా స‌ల‌హాలు ఇచ్చేవారా?
 లేదండి ఎవ్వ‌రి స‌ల‌హాలు లేవు. నేను సొంతంగా డెసిష‌న్ వ‌చ్చింది. 


మీరు నిర్మాత‌గా, హీరోగా ఇన్ని చేసిన‌ప్పుడు ద‌ర్శ‌కుడు ఎందుకు అవ్వ‌లేదు?
 ఉంది. ద‌ర్శ‌కుడు అవ్వాల‌నుకున్నాను. ఒకొనొక‌సంద‌ర్భంలో వెనుకంజ వేశాను. ఇప్పుడు అనిపిస్తుంది చెయ్యాల‌ని. అనుభ‌వం ఉండ‌డం వ‌ల్ల చెయ్యాల‌ని ఉంది. చిన్న సినిమాలు తియ్య‌వ‌చ్చు. నాకు ఇప్ప‌టికీ యాక్టింగ్ కంటే ఒక నిర్మాత‌గా సినిమా తియ్య‌డం అంటే ఇష్టం. నేను ఐదు సినిమాలు చేస్తే దాదాపు నాలుగు సినిమాలు సూప‌ర్ హిట్లు. నేను న‌న్ను ఎప్పుడూ న‌మ్ముకోను క‌థనే న‌మ్ముతాను. క‌థే నా హీరో. రెండోది స్క్రీన్‌ప్లే, మూడు నేను హీరో అలా అనుకునే సినిమాలు చేశాను. నా సొంత సినిమా క‌దా అని నాకోసం అన్ని పెట్టుకుంటే సినిమా ఆడ‌దు. నేను ఎప్పుడూ క‌థ‌నే న‌మ్ముతాను శివ‌కృష్ణ‌ని న‌మ్మ‌ను.


మరింత సమాచారం తెలుసుకోండి: