న్యాచురల్ స్టార్ నాని 25 వ సినిమా గా తెరకెక్కిన చిత్రం జెర్సీ సినిమాలో క్రికెటర్ గా నటించి  అదరగొట్టాడు దానితో సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించాడు. ఆ సినిమా టైటిల్ చిరంజీవి సినిమాది. కథేమో కామెడీ తో రూపొందించబడింది. 

ఇకపోతే ఈ సినిమాకు విక్రమ్ కె దర్శకత్వం వహించారు. మొన్న పదమూడో తారీఖు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఫస్ట్ షో కె మంచి టాక్ తో దూసుకుపోయింది. ఆగస్టు ౩౦ న వచ్చిన సాహో సినిమా తో పోలిస్తే ఈ సినిమా ఓ మాదిరిగా ఉందని అందరి చేత శబాష్ అనిపించుకుంది. అయితే, నాని ఇప్పటి వరకు వచ్చిన టాక్ ని బట్టి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ సినిమా కలెక్షన్ విషయానికొస్తే.. రిలీజ్ అయినా కొద్దీ రోజులకే కోట్లను కొల్లగొట్టింది. ఫస్ట్ డే కలెక్షన్ 9 కోట్లకు పైగా రాబట్టింది. సినిమా తెరకెక్కింది మాత్రం లో  బడ్జెట్ అయినా కూడా కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి. 
కామెడీ కథ తో రూపిందించిన ఈ సినిమా త్రిల్లర్ కుటుంబ కథ చిత్రంగా తెరక్కేకింది. ఐదుగురు ఆడవాళ్ళూ తో నవ్విస్తానంటూ నాని చేసిన ఈ కొత్త ప్రయోగం ఎట్టకేలకు సక్సెస్ అయింది. రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండు రోజులకు గాను

దాదాపుగా 6 కోట్లకు రాబట్టింది. మున్ముందు ఇంకెంత కలెక్షన్ ను రాబడుతుందో చూడాలి.. నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వి అనే హారర్ త్రిల్లర్ కథాంశంతో రూపొందించబోయే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: