ప్రతీ సంవత్సరం సంక్రాంతికి రిలీజయ్యో సినిమాల డేట్స్ ని 4 నెలల ముందుగానే ఫిక్స్ అవుతాయి. అలాగే ఈ సారి కూడా 2020 పొంగల్ కి ఓ నాలుగు సినిమాలు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే ఇంత వరకూ ఆ సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం ప్రకటించలేదు. లేటెస్ట్ గా అందిన అప్ డేట్ ప్రకారం ఈ నాలుగు సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అయ్యాయని తాజా సమాచారం. రీసెంట్‌గా నలుగురు నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చి రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారట.

బాబు 'సరిలేరు నీకెవ్వరు' అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' తో పాటు కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్నాయి. అయితే వీటితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ 'దర్బార్' సినిమా కూడా డబ్బింగ్ సినిమాగా సంక్రాంతికే రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. 'దర్బార్' విడుదలైన నెక్స్ట్ డే అంటే జనవరి 11న మహేష్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తాడని సమాచారం. బన్నీ'అలా వైకుంఠపురములో' సినిమాను జనవరి 12 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు విడుదలయ్యాక సరిగ్గా సంక్రాంతి రోజు అంటే 15న కళ్యాణ్ రామ్ సినిమా రానుంది. శతమానం భవతి సెంటిమెంట్ తో ఈ డేట్ ని లాక్ చేసుకున్నారట చిత్ర బృందం.

ఇప్పటికే రిలీజ్ డేట్స్ లాక్ చేసేసుకున్న మేకర్స్ ఇంకా అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయట్లేదు. ప్రస్తుతానికైతే అందరూ సంక్రాంతి రిలీజ్ అంటూనే ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలోనే ఉన్న ఈ నాలుగు సినిమాలు ఒకసారి ప్రమోషన్స్ స్టార్ట్ చేసాక రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తారని సమాచారం. అయితే అఫీషియల్ గా డేట్స్ కన్‌ఫర్మ్ చేయకపోవడానికి కారణం ఒకవేళ పొస్ట్ ప్రొడక్షన్స్ పనులు గనక ఆలస్యం అయితే ఈ డేట్స్ అటు ఇటు అయ్యో ఛాన్స్ ఉందని అర్థమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: