నాని హీరోగా లాస్ట్ ఫ్రై డే రిలీజైన సినిమా గ్యాంగ్ లీడర్. విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. రెగ్యులర్ స్టోరీస్ కు భిన్నంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రియాంకా అరుల్ మోహన్. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా ఇదే.


సినిమాలో ఆమెకు పెద్దగా స్కోప్ లేకున్నా సరే ఉన్నంతలో ప్రియాంకా తన సత్తా చాటింది. అంతేకాద్ హోమ్లీ లుక్ తో ప్రేక్షకులను అలరించింది. సినిమాలో ప్రియా పాత్రకు ప్రియాంకా తన వరకు పూర్తి నాయం చేసిందని చెప్పొచ్చు. అందుకే సినిమా రిలీజైందో లేదో అప్పుడే ప్రియాంకా మోహన్ ఫ్యాన్ క్లబ్ స్టార్ట్ చేశారు.   


ఇంకొంతమంది ప్రేక్షకులు ఆమెను కీర్తి సురేష్ తో పోల్చేస్తున్నారు. మళయాళ బ్యూటీ కీర్తి సురేష్ కూడా పక్కింటి అమ్మాయిగా నటిస్తూ మెప్పిస్తుంది. అయితే మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ రేంజ్ పెరిగింది. తెలుగులో ప్రస్తుతం మిస్ ఇండియా సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ తమిళంలో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది.


ప్రియాంకా మోహన్ కు కూడా కీర్తి సురేష్ లానే మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు. గ్యాంగ్ లీడర్ లో పెద్దగా స్కోప్ దొరకకున్నా ప్రమోషన్స్ లో తన స్పెషల్ లుక్ తో ప్రియాంకా అందరిని తన వల్లో పడేస్తుంది. మరి కీర్తి సురేష్ కోసం ట్రై చేసే దర్శక నిర్మాతలు ప్రియాంక దగ్గర్ ఆగే అవకాశం ఉంది. అయితే ప్రియాంకా తొలి ప్రయత్నం సక్సెస్ అవగా ఆమె రెండో సినిమా ఎవరితో చేస్తుందో దాన్ని బట్టి ఆమె టాలీవుడ్ కెరియర్ అధారపడి ఉంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: