నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన సినిమా "గ్యాంగ్ లీడర్" శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. సినిమా అక్కడక్కడా కొంచెం స్లోగా ఉందనే టాక్ వచ్చినప్పటికీ, కథ ఇంటెస్టింగ్ గా, కథనం వినోదాత్మకంగా సాగడంతో సినిమాకు కలెక్షన్ల పరంగా ఎలాంటి  ఢోకా లేదని చెప్పాలి. పెన్సిల్ పార్థసారథి గా నాని అద్భుతమైన నటనని కనబర్చాడు.


ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. రెండు రోజుల షేర్ రూ.10 కోట్ల మార్కును టచ్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా స్టడీగా సాగిపోతుండగా.. యుఎస్‌లో అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం శనివారం నాటికే హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం విశేషం.


వారాంతం అయ్యేసరికి హాఫ్ మిలియన్ అంటూ ట్రేడ్ పండిట్లు అంచనా వేయగా.. శనివారానికే 5.7 లక్షల డాలర్లకు ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్లు చేరుకున్నాయి. ప్రీమియర్లు, శుక్రవారం వసూళ్లు కలిపితే 3.5 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘గ్యాంగ్ లీడర్’.. శనివారం మరింత ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఒక్క రోజులో 2.25 లక్షల డాలర్లు వచ్చాయి. దీంతో అలవోకగా హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది.


రెండో వారం వరకు సినిమా ఇలాగే ఉంటే మిలియన్ డాలర్ క్లబ్ లీ చేఅడం ఖాయం. సాధారణంగా అమెరికాలో రివ్యూలని బట్టే సినిమా కలెక్షన్లు ఉంటాయి. రివ్యూ బాగుంటేనే సినిమా చూడడానికి వస్తారు. సినిమా నెరేషన్ స్లో గా ఉందనే టాక్ వచ్చినా, ఇంతల ఆదరిస్తుండటం ఆశ్చర్యకమనే చెప్పాలి. దీన్ని బట్టి నానికి ఓవర్సీస్ లో ఎంత మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: