తెలుగు చలన చిత్ర సీమ చాలా ఘనమైనది. ఎంతో మంది మేటి నటులను అందించింది. వివిధ విభాగాల్లో  తమ ప్రతిభను చాటి చెప్పిన నటశేఖరులు ఎందరో టాలీవుడ్లో ఉన్నారు. స్వర్ణయుగం కాలం నుంచి చూసుకుంటే ఇప్పటికీ ఆ టాలెంట్ అలా వారసత్వంగా వస్తోంది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ ప్రస్తుతం ఏంటన్నది ఒక్కసారిగా ఆలోచించుకుంటే...


ఓ వైపు ఆనందం, మరో వైపు విషాదం కలుగుతాయి. విషాదం ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్నా ఉపయోగించుకొలేని టాలీవుడ్ పరిస్థితిని చూసి. ఇక ఆనందం ఏంటి అంటే మనకు మంచి నటనా సంపద ఉందని. బ్రహ్మానందం ఇపుడు ఎక్కడా జోరు చేయడంలేదు. ఆయనకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో కామెడీకి ఎవరు అనుకుంటున్న పరిస్థితుల్లో వెన్నెల కిషోర్  రిప్లేస్ చేస్తున్నడని అంటున్నారు.



బ్రహ్మానందం మాదిరిగానే వెన్నెల కిషోర్ ని తెరపైన చూసినా వెంటనే నవ్వులు వస్తాయి. ఇక ఆయన పంచ్ డైలాగులు, బాడీ లాగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమాకు వెళ్లే ప్రతి ఆడియన్ కోరుకునేది వినోదం. దాన్ని కామెడీలో పీక్స్ తీసుకువెళ్ళే సత్తా బ్రహ్మానందానికి ఉంది.



ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినపుడు  నేనున్నాను అంటూ వెన్నెల కిషోర్ ముందుకు వచ్చాడు. హీరో ఫ్రెండ్ గా  కానీ, ఇతర పాత్రల్లో కానీ ఏది ఇచ్చినా చాలు కిషోర్ తనదైన స్టైల్లో రెచ్చిపోతాడు. ఆయన కామెడీ టైమింగ్ అలాంటిది. లేటెస్ట్ గా గ్యాంగ్ లీడర్ మూవీలో కూడా వెన్నెల కిషోర్ ఇరగదీశాడని టాక్ నడుస్తోంది. ఆయన పాత్ర పట్టుమని పది నిముషాలు మాత్రమే ఉన్నా కూడా కడుపునొప్పి తెప్పించేశాడట.



  అంతకు మును నాగ్ మూవీ మన్మధుడు 2 లో కూడా కిషోర్ హీరో ఫ్రెండ్ గా అదిరిపోయే కామెడీని పండించాడు. వరస చూస్తూంటే బ్రహ్మానందం ప్లేస్ ని కిషోర్ తొందరలోనే ఆక్యుపై చేసేలా కనిపిస్తున్నాడని అంటున్నారు. టాలెంట్ నిండుగా ఉన్న కిషోర్ ని టాలీవుడ్ ఎంత వాడుకుంటే అంత అంటున్నారిపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: