టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహబలి, బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించింది.  ఈ మూవీ అప్పటి వరకు దేశంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఈ మూవీలో నటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎంతో మంచి పేరు రావడమే కాదు..ఏకంగా జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకు వచ్చింది.  అప్పటి నుంచి  ఈమూవీ తర్వాత ప్రభాస్ నటించే ప్రతి సినిమాపై అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి.  ఇదే సమయంలో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సాహూ’ మూవీ బారీ అంచనాల మద్య రిలీజ్ అయ్యింది. 

ఈ మూవీకి రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టారు.  అయితే రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మూవీ ఫెయిల్యూర్ టాక్ వచ్చింది.  తెలుగు, మళియాళ, కన్నడ భాషల్లో కాస్త నిరాశ పరిచినా..బాలీవుడ్ లో మాత్రం మంచి టాక్ వచ్చింది..కలెక్షన్లు బాగా సాధించింది.  రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఫైనల్ రన్ కు చేరుకుంది. మొదటినుండి మిశ్రమ స్పందన వచ్చిన ఈ చిత్రం ఒక్క హిందీలో తప్ప మరెక్కడా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 40 కోట్ల వరకూ నష్టాలను మూటగట్టుకుంటోంది. కొన్ని చోట్ల అయితే గత సినిమాల రికార్డులు కూడా బ్రేక్ చేసింది. అయితే సాహో కొన్ని చోట్ల రికార్డులను కూడా తిరగరాసింది లెండి.

నెల్లూరు జిల్లాలో సాహో బాహుబలి 1 వసూళ్లను దాటేసింది. 16వ రోజున నెల్లూరులో 1,85,796 రూపాయల షేర్ సాధించిన సాహో మొత్తంగా 4,30,50,033 రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసి బాహుబలి 1 పేరిట ఉన్న 4.30 కోట్ల షేర్ ను దాటేసింది. అయితే బాహుబలి 2 ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. సాహో ఫైనల్ రన్ కు చేరుకోవడంతో ఇక బాహుబలి 2 ను దాటడం అసాధ్యమనే చెప్పాలి. మొత్తానికి తన బ్రేక్ తనే రికార్డు చేసుకున్న ఘనత ప్రబాస్ కి దక్కింది.



మరింత సమాచారం తెలుసుకోండి: