టిడిపి మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావు నేడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం అందుతోంది. కొద్దిరోజుల క్రితం ఆయనపై గత ప్రభుత్వ హయాంలో సచివాలయంలోని ఫర్నీచర్ ని అక్రమంగా తరలించారనే విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన కొంత మానసిక వేదనకు గురై ఈ పని చేసినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటున్న కోడెల, నేడు హఠాత్తుగా ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోయినట్లు సమాచారం. అయితే ఆయన పరిస్థిని గమనించిన ఇంట్లోని వారు, వెంటనే ఆయనను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించి, చికిత్స ఇప్పిస్తున్నట్లు సమాచారం. 

అయితే ఆయన పరిస్థితిపై డాక్టర్లు మాత్రం సరిగ్గా చెప్పడం లేదని, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎంతో విషమంగా ఉందని సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటనతో సత్తెనపల్లిలోని ఆయన అంచుచరులందరూ ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారట. ఇక టిడిపి అధినేత చంద్రబాబు సహా పలువురు టిడిపి నాయకులు ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ పయనమయినట్టు సమాచారం అందుతోంది. అయితే అసలు కోడెల ఎందుకోసం ఆత్మహత్యకు ప్రయత్నించారు అనేది మాత్రం స్పష్టంగా తెలియరావడం లేదు. ఇప్పటికే కొద్దిరోజులుగా కేవలం ఆయన పైనే కాక, ఆయన కుమారుడు మరియు కుమార్తె పై కూడా పలు విధాలుగా కేసులు పెడుతూ ఉండడం, కోడెలను ఎంతో మానసిక వేదనకు గురిచేసిందని అంటున్నారు అయన సన్నిహితలు. 

అందువలన గత కొద్దిరాజుల నుండి కోడెల సరిగ్గా భోజనం కూడా చేయడం లేదని, తనపై అలానే తన కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెట్టి అధికార పక్షం వారు కావాలనే కక్షకట్టారని, ఆయన తన సన్నిహితల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. అయితే కోడెలను ఎట్టిపరిస్థితుల్లో రక్షించేందుకు డాక్టర్లు ఎంతో శ్రమ పడుతున్నారని, మరింత మెరుగైన వైద్యం అందించేందుకు మరికొందరు డాక్టర్లు బసవతారకం ఆసుపత్రికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం మరికొద్దిసేపటిలో తెలియనుంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: