‘సాహో’ నెగిటివ్ టాక్ తెచ్చుకుని కూడ 450 కోట్ల గ్రాస్ కలక్షన్స్ కు దగ్గర పడుతూ ఉండటంతో ప్రభాస్ కు బాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. అదేవిధంగా జూనియర్ చరణ్ లకు వచ్చే ఏడాది విడుదలకాబోయే ‘ఆర్ ఆర్ ఆర్’ తో బాలీవుడ్ లో వీరిద్దరికీ మంచి ఇమేజ్ ఏర్పడబోతోంది.

ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ దృష్టి కూడ బాలీవుడ్ పై పడటంతో పాటు తనతో భారీ సినిమాలను తీయగల దర్శక నిర్మాతల కోసం అన్వేషణ మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక్క మహేష్ అల్లు అర్జున్ లకు తప్ప మిగతా టాప్ యంగ్ హీరోలందరికీ బాలీవుడ్ ఎంట్రీకి మార్గం ఏర్పడింది. 

ఆఖరికి విజయ్ దేవరకొండ కూడ బాలీవుడ్ లో తన ఇమేజ్ పెంచుకోవడానికి తనవంతు ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టేసాడు. ఇలాంటి పరిస్థితులలో పెరిగిపోతున్న ఈ పోటీ వాతావరణంలో తనకు కూడ బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడాలని బన్నీ భావిస్తున్నాడు. ఈకారణాల వల్లనే అల్లు అర్జున్ దిల్ రాజ్ వేణు శ్రీరామ్ ల కాంబినేషన్ లో ప్రారంభం కావలసిన మూవీ బడ్జెట్ ను ఒకేసారి భారీ స్థాయిలో పెంచి ఏకంగా దిల్ రాజ్ కు షాక్ ఇచ్చి ఈ గ్యాప్ లో సుకుమార్ సినిమాను కంప్లీట్ చేయబోతున్నాడు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ కోరికలు వింటున్న నిర్మాతలు మటుకు బన్నీ మార్కెట్ బాలీవుడ్ లో ప్రభాస్ లా ఒకేసారి పెరగడం అంత సులువైన పని కాదని ప్రభాస్ కు ‘బాహుబలి’ ఇమేజ్ తో ఏర్పడిన ప్రత్యేక గుర్తింపు బన్నీ గుర్తించలేక పోతున్నాడా అంటూ గుసగుసలాడుకుంటున్నట్లు టాక్. అయితే బన్నీ కలలు అన్నీ సంక్రాంతికి రాబోతున్న ‘అల వైకుంఠపురంలో’ క్రియేట్ చేసే రికార్డుల మీద ఆధారిపడి ఉంటుందని మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: