టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది.  గంగోత్రి సినిమా లో సింపుల్ గా పరిచయం అయిన అల్లు అర్జున్ తర్వాత తన విశ్వరూపం చూపించాడు.  దేశముదురు, ఆర్య,బన్ని లాంటి సినిమాల్లో డ్యాన్స్, ఫైట్స్ తో ఇరగదీశాడు. దాంతో మెగా హీరో అంటే ఇలా ఉండాలని అభిమానులు తెగ సంతోషపడిపోయారు.  అంతే కాదు అల్లు అర్జున్ తన ఆహార్యంలో కూడా చాలా స్టైల్ కనబరిచేవారు..అందుకే టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

గత యేడాది నా పేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు బన్ని.  దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్ని చాలా డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.  ప్రస్తుతం బన్నీ తనకు వరుస హిట్స్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  'అల.. వైకుంఠపురములో'  సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ షర వేగంగా జరుగుతుంది.  ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు బాలీవుడ్ వైపు చూస్తున్నారని ఈ మద్య వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

ఇప్పటికే రాంచరణ్ బాలీవుడ్ లో జంజీర్ సినిమా లో నటించాడు. ఈ మద్య ప్రభాస్ కూడా బాలీవుడ్ లో ‘సాహెూ’సినిమాతో సంచలనం సృష్టించారు.  యువ నటుడు విజయ్ దేవరకొండ సైతం బాలీవుడ్ పై కన్నెసినట్లు వార్తలు వచ్చాయి.  ఇప్పుడు అల్లు అర్జున్ చూపు బాలీవుడ్ వైపు పడిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ నటించిన సినిమాలు బాలీవుడ్ లో యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. రాజమౌళి తీసిన సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నాయి. త్వరలో రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న‘ఆర్ఆర్ఆర్’ మూవీ కూడా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ కూడా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా బాలీవుడ్ లో ఓ రాయి వేస్తే పోయేదేముంది అనిపించిందట. అందుకే తన దగ్గర వచ్చే దర్శకులను పాన్ ఇండియా లెవెల్లో సేల్ అయ్యే సబ్జెక్ట్ ను తీసుకురమ్మని అడుగుతున్నాడట.బాలీవుడ్ ఆలోచనలు బన్నీకి రావడానికి మరో ప్రధాన కారణం.. అక్కడ తన డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తీసుకొస్తుండడమేనని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్ హిట్స్ అందుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: