రాశీఖన్నా ఢిల్లీ భామ. అందంతో అదరగొట్టే సత్తా ఉన్న నెరజాణ. చేసింది తక్కువ సినిమాలే అయినా జనానికి బాగానే రీచ్ అయింది. ముఖ్యంగా కుర్ర కారు గుండెల్లో మంటలు పుట్టించింది. రాశీ ఖన్నా అంటే చాలు యూత్ ఉర్రూతలూగుతారంటే అబద్దం కాదేమో. ఇక రాశీఖన్నా అనగానే మెదిలే రూపం వేరు. ఆమె ముద్దుగా, బొద్దుగా ఉంటూ అందరికీ అలరించే టాలెంట్ తన సొంతం అంటుంది.


ఇక ఈ బొద్దు గుమ్మ సన్నబడాలని డిసైడ్ అయి చాలా కాలం నుంచీ ఆమె జీరో సైజ్ కోసం బాగా  ట్రై చేస్తోందట. ముఖ్యంగా జిమ్  కి  కెళ్ళి ఒకేలా కసరత్తులు చేసిందంట. అలాగే నోటికి తాళం వేసుకుని ఎన్నో కంట్రోల్ చేసుకుందట. అన్ని చేసినా కూడా రాశిలో రాశి ఎక్కడా తగ్గడంలేదుట. దాంతో ఇక లాభం లేదని బాధపడుతూంటే తెలిసిన వారెవరో హిమాలయాలకు వెళ్లమన్నారుట.


 
అక్కడ ఆనందాశ్రమానికి  వెళ్తే రాశీ బాడీ కఫ తత్వమని చెప్పారుట. దానికి తగ్గట్లుగా డైట్ తీసుకుంటే కసరత్తులు చేస్తే సన్నబడతారని చెప్పారట. దాంతో ఈ ముద్దు గుమ్మ ఆశ్రమ నిర్వాహకులు చెప్పినట్లుగానే అన్నీ చేస్తోందట. ఇపుడు దాని ఫలితం తనకు కనిపిస్తోందని, తాను బాగా తగ్గేందుకు ట్రై చేస్తున్నానని అంటోంది.


మొత్తానికి హిమాలయాలకు వెళ్ళి అనుకున్నది సాధించిన రాశీఖన్నాను అంతా అభినందిస్తున్నారు. రాశిలో ఉన్న పట్టుదల ఏంటన్నది కూడా ఈ దెబ్బతో తెలిసిందని కూడా అంటున్నారు. ఇపుడు నాజూకుగా తయారైన ఈ భామ ఏ హీరో పక్కన మెరిసిపోతుందో చూడాలి మరి.  ఎవరి పక్కన ఉన్నా కూడా చక్కనమ్మ కదా  మరి, ఎంత చిక్కినా అందమే. అది ఆనందమేగా. సో వెయిట్ అండ్  సీ.. రాశీఖన్నా కొత్త రూపం ఏంటో.





మరింత సమాచారం తెలుసుకోండి: