తెలుగులో అర్జున్ రెడ్డితో సత్తా చాటిన సందీప్ వంగ అదే సినిమాను హిందిలో కబీర్ సింగ్ అంటూ రీమేక్ చేసి అక్కడ సూపర్ హిట్ కొట్టాడు. తెలుగులో విమర్శలతో పాటుగా కలక్షన్స్ రాగా అదే క్రమంలో బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ పై వివాదాలతోనే సినిమాకు వసూళ్లు బాగా వచ్చాయి. అందుకే సందీప్ వంగాకు అక్కడ బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది.


కబీర్ సింగ్ తర్వాత తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సందీప్ వంగ సినిమా ఉంటుందని అన్నారు. కాని ఆ సినిమాలో హిరో మారినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో తీయాలనుకున్న సందీప్ వంగ మరోసారి హిందిలో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ వంగ సినిమా ఉంటుందని తెలుస్తుంది.


ఈ సినిమాకు డెవిల్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా కబీర్ సింగ్ ను మించి ఉంటుందని తెలుస్తుంది. కబీర్ సింగ్ తోనే కేకలేసిన బాలీవుడ్ ఆడియెన్స్ దాన్నిమించి అంటే మాత్రం ఇంకెలా ఉండబోతుందో అని ఎక్సైట్ అవుతున్నారు. క్రైం థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను డైరక్షన్ మాత్రమే కాదు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడట సందీప్ వంగ.  


కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడి ఉన్న షాహిద్ కపూర్ ను కబీర్ సింగ్ తో హిట్ ట్రాక్ ఎక్కించాడు సందీప్ వంగ. అందుకే రణబీర్ కపూర్ కూడా సందీప్ వంగ మీద పూర్తి కాన్ ఫిడెంట్ గా ఉన్నాడట. డెవిల్ టైటిలే డిఫరెంట్ గా ఉంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ అక్కడే కెరియర్ కొనసాగించేలా ఉన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: