మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ... మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ...తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు .భిన్నమైన  కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు . అయితే తాజాగా  వరుణ్ తేజ్ నటించబోతున్న సినిమా వాల్మీకి ...హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం  వహిస్తున్నాడు . ఈ సినిమాలో వరుణ్ ఫుల్ మాస్ గా డిఫెరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు   . ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు . అయితే ఈ మధ్య ప్రతి సినిమాకి ఎదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది . ఈ నేపథ్యంలోనే వాల్మీకి మూవీ ని కూడా ఓ వివాదం వెంటాడుతూనే ఉంది .


ఈ సినిమా టైటిల్ బోయ సంఘాల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ... ఈ చిత్ర టైటిల్ మార్చాలని బోయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి .అయితే  ఓ గ్యాంగ్‌స్ట‌ర్ మంచివాడుగా ఎలా మారాడు..అనే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని అందుకే వాల్మీకి అనే పేరు పెట్టమని ... ఈ సినిమా ఎవరి హావభావాలు దెబ్బతినకుండా చిత్రీకరించామని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినప్పటికీ ...బోయ వాళ్ళు నిరసనలు మాత్రం ఆపటం లేదు .రామాయ‌ణాన్ని రాసిన వాల్మీకి పేరుని ఓ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు పెట్టి ..  ఆయన్ని ఓ గ్యాంగ్ స్టర్‌తో ఎలా పోలుస్తారంటూ వాళ్లు మండిపడుతున్నారు.


ఇక ఈ వివాదంలోకి  తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా వచ్చాడు . లక్ష్మణ్ ని బోయ సంఘం  కలిసి వాల్మీకి సినిమా టైటిల్ పై ఫిర్యాదు చేయటం తో ...అయన కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు .ఓ గ్యాంగ్ స్టార్ సినిమాకి రామాయణం రాసిన వాల్మీకి పేరు పెట్టటం తప్పని ...దీనిపై సెన్సార్ బోర్డుకు కూడా పిర్యాదు చేశామని తెలిపారు . మీరు సినిమా టైటిల్ మార్చకపోతే బోయ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ...వాళ్లంతా ఏకం అయ్యి నిరసన తెలుపుతారని అన్నారు . తర్వాత పరిణామాలపై చిత్ర బృందమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు లక్ష్మణ్ . ఈ విషయంలో చిత్ర బృందం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: