ప్రతీ హీరోకు ఫ్యాన్ వుంటాడు.. అయితే ఆ హీరోలందరి ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు చాలా అరుదు. కాని స్టైలే వేరు. అలా అందరు హీరోల ఫ్యాన్స్ ని తన ఫ్యాన్స్ గా మార్చుకున్న ఒకే ఒక్క హీరో నేచురల్ స్టార్ నాని. ఎటో వెళ్లిపోయింది మనసు- పైసా- జెండా పై కపిరాజు- ఆహా కళ్యాణం వంటి వరుస పరాజయాల తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. భలె భలే మగాడివోయ్ సినిమాతో ఓవర్సీస్ లో తన సత్తా చాటుకున్న నాని సినిమా సినిమాకి తన స్టార్ డమ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఎమ్ సీ ఏ సినిమాతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. 

వరుసగా నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడం కలిసొచ్చింది. కానీ అక్కడ నుంచి అంగుళం కూడా కదలడం లేదు. నానీకి నెక్ట్స్ లెవల్ ఏది? అంటే మాత్రం సరైన స్పష్టత కనిపించడం లేదు. నాని నటించిన కొత్త సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి రోజు 4 కోట్ల 50 లక్షల గ్రాస్ ని సాధించింది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి హైర్స్ రావడం విశేషం. కృష్ణార్జున యుద్ధం- దేవదాస్- జెర్సీ సినిమాలకు ఒకే తరహా ఓపెనింగ్స్ వచ్చాయి. గ్యాంగ్ లీడర్ తొలి రోజు ఒపెనింగ్స్ ఆ మూడు సినిమాల తరహాలోనే కొనసాగాయి. ఓపెనింగ్ డే చూస్తే.. కలెక్షన్స్ 4 కోట్ల 50 లక్షలు వసూలైంది. జెర్సీ- 4 కోట్ల 50 లక్షలు దేవదాస్- 4 కోట్ల 61 లక్షలు కృష్ణార్జున యుద్ధం- 4 కోట్ల 58 లక్షలు నేను లోకల్ - 4 కోట్ల 45 లక్షలు నిన్ను కోరి- 4 కోట్ల 59 లక్షలు వసూలు చేశాయి. దీన్ని బట్టి చూస్తే నాని రేంజ్ ఒకేలా ఉండిపోయింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఒకే దగ్గర ఆగిపోయింది.

ఈ లెక్కలని బట్టి చూస్తుంటే నాని స్టార్డమ్ ఒక స్టేజ్ కి వచ్చి ఆగిపోయిందా? అన్న అనుమానం కలుగుతోంది. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది? తన కంటే జూనియర్ హీరోలు తన స్పీడ్ ని ఓవర్ టేక్ చేస్తుంటే నాని ఎత్తుగడలు ఎందుకని మార్చడం లేదు?  దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్- మజిలీ- ఇస్మార్ట్ శంకర్ సినిమాలు గ్యాంగ్ లీడర్ ని మించి ప్రారంభ వసూళ్లని సాధించాయి. నానీ రేంజును దాటేస్తున్నాయి. డియర్ కామ్రేడ్ - 6 కోట్ల 97 లక్షలు - ఇస్మార్ట్ శంకర్ - 7 కోట్ల 83 లక్షలు - మజిలీ - 5 కోట్ల 35 లక్షలు ప్రారంభ వసూళ్లు సాధించి ముందు వరుసలో నిలిచాయి. అంటే నాని ఎంతగా వెనకబడి ఉన్నాడో తెలుస్తోంది. అందుకే ఇప్పుడు మరో మెట్టు పైకెక్కాలంటే నానీ కొత్తగా, డిఫ్రెంట్‌గా ఆలోచించి కొత్త తరహా కథలను అంచుకుంటే మళ్ళీ అందరిని దాటి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: