షాక్, మిరపకాయ్, రామయ్యా వస్తావయ్యా, గబ్బర్ సింగ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, డిజె..డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు. ఈ సినిమాలలో రవితేజ తో తీసిన మిరపకాయ్ మంచి కమర్షియల్ హిట్ అందుకుంటే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ను బద్దలు కొట్టి కొత్త రికార్డ్స్ ను క్రియోట్ చేసింది. ఇక ఆ తర్వాత బన్ని తో తీసిన డిజె అంతగా సక్సస్ కాకపోయినప్పటికి మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలన్నిటికి తన గురించి తను చాలా తక్కువగా మాట్లాడాడు. కాని తొలిసారి డైరక్టర్ హరీష్ శంకర్ నోట ఆయన గురించి ఆయన చెప్పడం అందరిని షాక్ అయ్యోలా చేసింది. 'ఇప్పడిప్పుడే వినయంగా, విధేయంగా వుండడం నేర్చుకుంటున్నా' అని హరీష్ అనడం ఆసక్తికరంగా మారింది. 

వాల్మీకి ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ, 'ఇప్పుడిప్పుడే వినయంగా, విధేయంగా వుండడం నేర్చుకుంటున్నా'.. మీ హరీష్ శంకర్ అని అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తరువాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మా హరీష్ వినయం, విధేయం నేర్చుకోవడం చాలా మంచి విషయం అన్నారు. ఇలా అనడంలో అసలు అర్థం ఏమిటనేది చాలామందికి కన్‌ఫ్యూజన్ గా ఉంది.

హరీష్ శంకర్ మంచి కమర్షియల్ డైరక్టర్ అన్న విషయం అందరికి తెలిసిందే. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డిజె సినిమాలతో తనకు కమర్షియల్ బాగా పల్స్ తెలుసు అని ప్రూవ్ చేసుకున్నారు. ఓ పాత తమిళ సినిమాను తీసుకుని, దానికి మేకోవర్ చేసి, అలాగే హీరోకి మేకవర్ చేసి, సాప్ట్ పాటల ఇచ్చే మ్యూజిక్ డైరక్టర్ కు మేకోవర్ చేసి, వాల్మీకి సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ తెచ్చారంటేనే తెలుస్తుంది హరీష్ శంకర్ స్టామినా ఏంటో.

సినిమా ఫలితం అనేది విడుదల తర్వాత మాట్లాడుకోవాల్సిన మాట. కానీ విడుదల దగ్గరపడే సరికి ఆ సినిమా గురించి, దాని విశేషాల గురించి కాస్తయినా మాట్లాడుకునేలా చేయడం అంటే చాలావరకు ఆ దర్శకుడు సక్సెస్ అయినట్లే. వాల్మీకి సినిమా టైటిల్ కానీ, వరుణ్ మేకోవర్ కానీ, మిక్కీ సాంగ్స్ కానీ ఇవన్నీ హరీష్ శంకర్ ఖాతాలోకే వస్తాయి.
కానీ గతంలో అనేకసార్లు హరీష్ వార్తల్లోకి ఎక్కడం కానీ, వాల్మీకి నిర్మాణంలో వివాదాలు కానీ అతని క్రెడిట్ బ్యాలెన్స్ ను బాగా తగ్గించేస్తున్నాయి. అందుకే వినయం, విధేయం నేర్చుకుంటున్నా అని వుండొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: