మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రతిరోజు పండుగే. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కు జోడీగా రాశి ఖన్నా నటిస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సుప్రీం సినిమా సూపర్ హిట్ అయ్యింది.  


హిట్ పెయిర్ గా నిలిచిన ఈ జంట మరోసారి ప్రతిరోజు పండుగే సినిమా కోసం జత కడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ అంతా జాలీగా గడుపుతున్నారు. షూటింగ్ గ్యాప్ లో చిత్రయూనిట్ క్రికెట్ కూడా ఆడుతున్నారు. డైరక్టర్ మారుతి బౌలింగ్ లో సాయి ధరం తేజ్ హిట్ కొట్టాడు ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. షూటింగ్ గ్యాప్ లో క్రికెట్ ఆడటం సరదాగా అనిపించింది. మీ అందరితో ఉంటే ప్రతిరోజు పండుగలా ఉందని కామెంట్ పెట్టాడు సాయి ధరం తేజ్.


అయితే ఈ మెసేజ్ కు రిప్లై గా హీరోయిన్ రాశి ఖన్నా అక్కడ తాను లేనందుకు బాధపడుతున్నా అంటూ మెసేజ్ పెట్టింది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు సినిమా షూటింగ్ అంతా ఎంత సరదాగా సాగుతుంది అన్నది. చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కిన సాయి ధరం తేజ్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో వస్తున్నాడు.


మారుతి మార్క్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుంది. ఈమధ్యనే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి సుప్రీం సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ప్రతిరోజు పండుగే సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. మారుతి మాత్రం ఈ సినిమాను హిట్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నాడు. క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ ఎండింగ్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: