రాను రాను బాలీవుడ్ కల్చర్ ను అలవరచుకుంటున్న తెలుగు పరిశ్రమలో సినిమా కథలనే కాదు వాటిని ప్రమోట్ చేసే రియాలిటీ షోలు కూడా బీ టౌన్ రిఫరెన్స్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే కపిల్ శర్మ, కాఫీ విత్ కరణ్ షోలలో సెలబ్రిటీస్ ను ఇది అడగొచ్చు ఇది అడగకూడదు అనేదే లేకుండా ఎలాంటి వాటినైనా అడిగేస్తున్నారు.  


అయితే అలా తెలుగులో షో నడిపించడం కష్టమే అని భావించారు. కాని మంచు వారి అమ్మాయి లక్ష్మి కొత్తగా అలాంటి టాక్ షో మొదలు పెట్టబోతుంది. అదే స్టార్స్ బెడ్ రూం సీక్రెట్స్. స్పైసీ కాన్సెప్ట్ తో మంచి లక్ష్మి హోస్ట్ గా సిద్ధం చేస్తున్న షో ఇది. సెలబ్రిటీల గురించి డీటైల్డ్ గా తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. 


సెలబ్రిటీస్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేస్తుంటారా అన్నది తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. బాలీవుడ్ లో ఆల్రెడీ ఫీట్ అప్ విత్ స్టార్స్ అనే షో నడుస్తుంది. అందులో ఫన్ తో పాటుగా హాట్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అలానే ఇప్పుడు మంచు లక్ష్మి ఓ షోని డిజైన్ చేసింది. సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితాల గురించి ఆడియెన్స్ కు తెలియచేసేలా ఈ షో నడుస్తుంది. అంటే ఫీట్ అప్ విత్ స్టార్ట్స్ కు ఇది టాలీవుడ్ వర్షన్ అన్నమాట.   


ఇంతవరకు ఇలాంటి షో తెలుగులో రాలేదని చెప్పాలి. వయాకామ్ 18 వారు నిర్వహిస్తున్న ఈ షోకి హోస్ట్ గా మంచు లక్ష్మి వ్యవహరిస్తున్నారు. మన సెలబ్రిటీస్ బెడ్ టైం సీక్రెట్స్ ను తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇలాంటి షోని చేస్తున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉందని అంటున్నారు మంచు లక్ష్మి. ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఈ షో ఉండనుందని.. సెలబ్రిటీస్ అందరు ఈ షోలో పాల్గొంటారని తనకే కాదు వాళ్లకు ఈ షో కొత్త అనుభూతి ఇస్తుందని అన్నారు మంచు లక్ష్మి. మరి ఈ షో ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.          


మరింత సమాచారం తెలుసుకోండి: