నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ ఖర్చుతో నిర్మితం అయిన ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించడం జరిగింది. పాటలు మరియు ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే తొలిరోజు తొలి ఆట చూసిన ప్రేక్షకులు, గ్యాంగ్ లీడర్ సినిమా తమ అంచనాలు అందుకోవడంతో సినిమాపై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఒక సాధారణ రివేంజ్ డ్రామాని, 

ఆకట్టుకునే స్టయిల్ లో మంచి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ను అలానే, ఇటువంటి మంచి స్టోరీని ఒప్పుకున్నందుకు హీరో నానిని ఎంతో మెచ్చుకుంటున్నారు. నూతన నటి ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కూబా ఫోటోగ్రఫీని అందించడం జరిగింది. ఇక రిలీజ్ అయి ఇప్పటికి నాలుగు రోజలు గడుస్తున్నప్పటికీ కూడా, గ్యాంగ్ లీడర్ దాదాపుగా చాలా చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇక మరొక మూడు రోజుల్లో వరుణ్ తేజ్ వాల్మీకి రిలీజ్ ఉన్నప్పటికీ, ఆ సినిమా యొక్క ఫలితం గ్యాంగ్ లీడర్ పై పెద్దగా ప్రభం చూపకపోవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

దానికి కారణం ఏంటంటే, గ్యాంగ్ లీడర్ ఇప్పటికే చాలా చోట్ల మంచి కలెక్షన్ సాధిస్తూ ముందుకు దూసుకుపోతుండడంతో, రాబోయే వాల్మీకి సమయానికి గ్యాంగ్ లీడర్ థియేటర్స్ పెద్దగా తగ్గించే అవకాశం లేదంటున్నారు. ఇక మరోవైపు వాల్మీకికి కూడా సరిపడా థియేటర్లు ముందే బుక్ చేయడంతో, ఒకవేళ ఆ సినిమా హిట్ సాధించినప్పటికీ కూడా రెండు సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విధంగా చూస్తే పెన్సిల్ పార్ధసారధి రాబోయే రోజుల్లో తన పదును మరింతగా పెంచేటట్లున్నాడే తప్ప ఏ మాత్రం తగ్గేటట్లు లేడని అంటున్నారు. ఇప్పటికే జెర్సీ తో మంచి విజయాన్ని దక్కించుకున్న నాని ఖాతాలో ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ రూపంలో మరొక విజయం వచ్చి చేరింది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: