సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవడానికి అందరికీ విపరీతమైన ఆశక్తి ఉంటుంది. ముఖ్యంగా సినిమాల షూటింగ్ ల సమయంలో హీరోలు హీరోయిన్స్ ఎలా ఉంటారు అన్న వార్తలు బయటకు వస్తుంటాయి కాని వారంతా వారి ఇళ్ళల్లో ఎలా ఉంటారు అని తెలుసుకోవాలి అన్న ఆతృత అందరిలో చాల ఎక్కువగ ఉంటుంది.

ఇప్పుడు సగటు బుల్లితెర ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మంచు లక్ష్మి మరో బుల్లితెర కార్యక్రమానికి డిజైన్ చేసింది. ఒక ప్రముఖ హిందీ ఛానల్ ఇప్పటికే ప్రసారం చేస్తున్న ‘ఫుట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమం ఆధారంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మితో పాటు అనేకమంది యంగ్ హీరోలు హీరోయిన్స్ పాల్గొంటూ షూటింగ్ ముగిసాక తమ ఇంటికి వచ్చిన తరువాత వారు చేసే చిలిపి పనులు కొన్ని ఆసక్తికర విషయాలను ఈ షోలో చూపెట్టబోతున్నారు. ఈ షోలో కొన్ని సీన్స్ హాట్ గా కూడ ఉంటాయని టాక్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈకార్యక్రమాన్ని ‘వయాకామ్ 18’ వాళ్లు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు మంచు లక్ష్మికి భారీ పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ఈ షోకి సంబంధించి ఇప్పటికే వరుణ్ తేజ్ సమంతలతో ఇప్పటికే రెండు షోలు షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. 

ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షోకోసం ఇప్పటికే చాలామందితో కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసే పనిలో మంచులక్ష్మి బిజీగా ఉంది. అక్కడక్కడ అడల్ట్ సౌండ్ ఇచ్చే మాటలతో స్పైసీ సీన్స్ తో ఉండే ఈకార్యక్రమాన్ని ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేయబోతోంది. సెలెబ్రెటీల బెడ్ టైమ్ స్టోరీస్ లా పాపులర్ కాబోతున్న ఈ సిరీస్ యూత్ ను బాగా ఆకర్షించే ఆస్కారం కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: