సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రక్రియలో మహేష్ చాలా విచిత్రంగా నామినేట్ అయ్యాడు. మహేష్ నామినేట్ అవడానికి గల కారణాలని పరిశీలిస్తే, ముగ్గురి వ్యవహార శైలి గురించి చెప్పుకోవాలి. మహేష్ నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి హిమజ తన బట్టలు, మేకప్ కిట్ అంతా వదులుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. దానికి సరేనని ఒప్పుకున్న హిమజ శివజ్యోతి సాయంతో అంతా సర్దేసి స్టోర్ రూంలో పెడుతుంది.


అయినప్పటికీ ఇంకా కొన్ని సామాన్లు మిగిలిపోవడంతో మహేష్ నామినేట్ అవుతాడు. ఇక్కడ తప్పెవరు చేశారని గమనిస్తే, మిగిలిపోయిన మేకప్ కిట్ల గురించి శివజ్యోతి అడిగినపుడు హిమజ అవి వాడటం లేదు కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు అంటుంది. ఎలాగూ వాడనపుడు పెట్టేస్తే అయిపోతుంది కదా! ఒంటి మీద బట్టలు తప్పితే మిగిలిన సామానంతా వదులుకొమ్మని చెప్పినపుడు ఆ రెండు మేకప్ కిట్లను మాత్రం ఎందుకు వదిలేసింది అనే అనుమానం ప్రేక్షకుల్లో కలుగక మానదు.


అదీ గాక వితికాని చెక్ చేయమన్నపుడు ఒక బుట్ట నిండా సామాను ఇంకా అక్కడే ఉండడంతో హిమజ ఇదంతా కావాలనే చేసినట్టుగా తెలుస్తుంది. మహేష్ నామినేట్ కావాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. నిజంగా మర్చిపోతే ఒకటి రెండు వస్తువులు మర్చిపోతారు. కానీ బుట్ట నిండా సామాను మర్చిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఆమె నిజంగా నామినేట్ చేయదల్చుకుంటే డైరెక్ట్ గా చెప్పి ఉండవచ్చు కదా అనే వాదన కూడా వినిపిస్తోంది.


ఎపిసోడ్ స్టార్టింగ్ లో హిమజ, ఎవరికోసమైనా ఎందుకు త్యాగం చేయాలి అనే మాట అంటుంది. దీన్ని బట్టి ఆమెకు త్యాగం చేయడం ఇష్టం లేదని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ మర్చిపోయిన సామానుని కూడా హిమజ వదులుకుంటానని సిద్ధంగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ మహేష్ ని నామినేట్ చేశాడు. ఇక్కడ బిగ్ బాస్ తప్పు చేశాడా అని అనిపించింది. కానీ బిగ్ బాస్ చెప్పిన  దాన్ని సరిగ్గా పాటించకపోవడమే పెద్ద తప్పుగా కనబడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: