జూనియర్ ఎన్టీయార్ కొంత భిన్నంగా ఆలొచిస్తాడు. కొత్త వారికే కాదు, టాలెంట్ ఉన్న వారికి కూడా చాన్సులు ఇస్తాడు. ఆయన సినిమాలను తీసుకుంటే కంటెంట్ ని నమ్మి ముందుకు వెళ్తాడనిపిస్తుంది. తనను కంఫర్ట్ జోన్లో ఉంచి సినిమా తీయాలనుకునే వారికి జూనియర్ ఎపుడూ వెల్ కం చెబుతాడు. ఇదిలా ఉంటే జూనియర్ సక్సెస్ ని తాము ఎంజాయ్ చేసిన వారు ఉన్నారు. ఆయనకు హిట్ ఇచ్చి సక్సెస్ తెచ్చిన వారూ ఉన్నారు.



ఇక జూనియర్ ఎన్టీయార్ తో పనిచేయాలని అంతా అనుకుంటారు. ముఖ్యంగా కొత్త డైరెక్టర్లు, యువ దర్శకుల కన్ను జూనియర్ మీద ఎపుడూ  ఉంటుంది. ఎందుకంటే ఆయనలో ఫైర్ అలాంటిది. జూనియర్ ని డైరెక్ట్ చేసి హిట్ కొడితే చాలు ఒక్కసారిగా మాస్ ఇమేజ్ వచ్చేస్తుంది. కమర్షియల్  డైరెక్టర్ గా ఓ వెలుగు వెలగవచ్చు. ఈ రకమైన ఆలోచనలతో చాలా మంది జూనియర్ ని అప్రోచ్ అవుతారు. అయితే జూనియర్ మాత్రం తాను అనుకున్న వారికి, వారి టాలెంట్ చూసి మరీ ఆఫర్ ఇస్తాడు.


అలా హరీష్ శంకర్ కి కూడా జూనియర్ చాన్స్ ఇచ్చాడు. ఇద్దరు కలసి చెసిన సినిమా రామయ్యా వస్తావయ్యా. ఈ మూవీ ఎందుకో సరిగ్గా ఆడలేదు. జూనియర్ కెరీర్లో ఉన్న  ఫ్లాప్స్ లో  ఒకటిగా చేరిపోయింది.
దాని మీద ఇపుడు హరీష్ శంకర్ కామెంట్స్ చేశారు. వాల్మీకి ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడుతూ, తనను నమ్మి జూనియర్ చాన్స్ ఇచ్చాడని తానే సరిగ్గా వినియోగించుకోలేదని హరీష్ అన్నాడు. అయినా సరే తనలో ఫైర్ అలాగే  ఉందని, మళ్ళీ చాన్స్ ఇస్తే మాత్రం ఈసారి జూనియర్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టి తీరుతానని పక్కా క్లారిటీగా చెప్పేశాడు. మరి జూనియర్ ఈ మాట వింటాడా, హరీష్ కాంబోలో కొత్త మూవీ చేస్తాడా. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: