‘వాల్మీకి’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైనా ఈ మూవీ టైటిల్ ను మార్చాలని భారతీయ జనతా పార్టీ యువజన విభాగం ఏకంగా సెన్సార్ బోర్డ్ అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడంతో ఈ విషయం పై సెన్సార్ ఎలా స్పందిస్తుంది అన్న సందేహాలు అందరిలోను వస్తున్నాయి. ఒక గూండా పాత్రను చేసిన వ్యక్తికి ‘వాల్మీకి’ లాంటి ఋషి పేరును ఎలా అనుమతిస్తారు అంటూ సెన్సార్ అధికారులను ఇరుకున పెడుతున్నారు.

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ టైటిల్ పై సెన్సార్ ఏమైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే ‘వాల్మీకి’ రాంగ్ టైమ్ రిలీజ్ అంటూ మెగా అభిమానులు కూడ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. 

‘సైరా’ మూవీ విడుదలకు ఇక కేవలం 14 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీనికితోడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 22న జరగబోతోంది. ఈ మూవీ మ్యానియా పీక్ కు చేరుకుంటున్న పరిస్థితులలో ‘వాల్మీకి హిట్ అయినా మెగా అభిమానులు అంతా ‘సైరా’ గురించి మాట్లాడుకుంటారు కాని ‘వాల్మీకి’ గురించి ఎవరు మాట్లాడుకోరు అన్న సందేహాలను మెగా అభిమానులు వ్యక్త పరుస్తున్నారు. 

దీనితో ‘వాల్మీకి’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రమే జనం పట్టించుకుంటారు కాని సాధారణ టాక్ వస్తే ఈ మూవీని పట్టించుకునే వారు ఎవరు అంటూ మెగా అభిమానులు ఒక సరికొత్త చర్చకు తెర తీస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఒక మీడియం రేంజ్ సినిమా కలక్షన్స్ తో రెండు వారాలు ఆడితే చాలు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తోంది. ఇలాంటి లెక్కలతోనే ‘వాల్మీకి’ చిరంజీవి ‘సైరా’ కు పైలెట్ వాహనంగా రాబోతోంది అని అనుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: