నయనతర. నయనాలు సైతం మాట్లాడుతాయి. ఆ చూపులు సైతం ప్రేమ లేఖలు రాస్తాయి. కలల రాకుమారిగా యువత గుండెల్లో గూడు కట్టుకున్న అందం నయన్ సొంతం. ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టి 14 ఏళ్ళు గడిచినా గ్లామర్ మాత్ర ఎక్కడా తగ్గలేదు. నయన్ అయిదు కోట్ల పారితోషికం ఈ మధ్యనే విజయ్ సినిమాకు తీసుకుందని టాక్ వచ్చింది. అంటే ఆమె డిమాండ్  ఏ రేంజిలో ఉందో వూహించుకోవాలి. 


ఓ విధంగా నయన్ లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదును సార్దకం చేసుకున్నారనే చెప్పాలి. నయన్ విషయంలో ఎవరేమనుకున్నా తన పాత్ర, తన రెమ్యునరేషన్ ఆమె కచ్చితంగా చూసుకుంటారని అంటారు. ఇక ప్రమోషన్లు వంటి వాటికి ఆమె దూరం. ఆమెతో సినిమాలు చేయలంటే ఆమె పెట్టే కొన్ని షరతులకు తలవొగ్గాల్సిందే. ఇక తెలుగులో నయన్  నటిస్తున్న సైరా మూవీ మరో పదిహేను రోజుల్లో రిలీజ్ కి సిధ్ధంగా ఉంది. ఇందులో మహరాణి లాంటి పాత్రలో నయన్ మెరిసిపోతుందని అంటున్నారు. ఇక నయన్ ఇపుడు సరికొత్త పాత్రలో కనిపించనుందని కోలీవుడ్లొ టాక్. నెట్రికన్‌ అన్న మూవీలో  లీడ్‌రోల్ చేస్తున్న నయన్ అంధురాలు కావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 


అదే జరిగితే ఆ అందాల కన్నులు సరికొత్త అభినయానికి కేంద్రాలు అవుతాన్నమాట. ఈ మూవీకి సంబధించి ఇంటెరీస్టింగ్ ఇన్ఫ‌ర్మేషన్ ఏంటి అంటే రిలీజ్ చేసిన  పోస్టర్‌పై రక్తపు మరకలు, సంకెళ్లు, కొరడా కనిపిస్తుండటం. దాంతో  థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కనుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. థ్రిల్లర్ కథాంశమైతే -తనదైన పెర్ఫార్మెన్స్‌తో నయన్ సినిమాను రక్తి కట్టించగలదన్న అంచనాలు లేకపోలేదు.


ఈ మూవీ గృహం ఫేమ్ మిలింద్‌రావ్ దర్శకత్వంలో  తెరకెక్కనున్నట్టూ వినిపిస్తోంది. నయనతార లీడ్ రోల్‌లో ప్రియుడు విఘ్నేశ్ శివన్ వైవిథ్యమైన సినిమాకు ప్లాన్ చేసినట్టు కొద్దిరోజులుగా వినిపిస్తోన్న మాట. దాన్ని నిజం చేస్తూ ఈ మూవీ వస్తోందన్నది కన్ ఫర్మ్ అని తేల్చేశారు. మరి చూడాలి నయన్ కొత్త పాత్రను మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: