మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా.. నరసింహారెడ్డి విడుదల తేదీ దగ్గర పడుతోంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లు కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత రామ్ చరణ్ ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు భారీగా బజ్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఈ సినిమాకు బాలీవుడ్ లో ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది.

 


సైరా.. తోపాటు అదే రోజు విడుదలవుతోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్. బాలీవుడ్ కండలవీరుడు హృతిక్, టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాను యాష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించింది. ఇటివలే విడుదల చేసిన ట్రైలర్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే.. ఈ సినిమాపై బాలీవుడ్ లో అంతగా బజ్ క్రియేట్ అవలేదు. ఇటువంటి యాక్షన్ సీన్లు ఉన్న సినిమాలు చూసి ఉండడం, హృతిక్ ఇంతకుముందు ఇచ్చిన ఫ్లప్ సినిమా వల్ల కూడా ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ లేదు. స్వాతంత్ర్య సమరయోధుడిగా చిరంజీవి సైరా మీద అక్కడ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రమోషన్ ఈవెంట్ మరొక్కటి బాలీవుడ్ లో జరిపితే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. హిందీలో ఇటువంటి సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారు. కంటెంట్ సరిగ్గా ఉంటే సినిమా భారీ కలెక్షన్లు సాధించడం ఖాయం.  

 


ఈనెల 18న సైరా ట్రైలర్ విడుదల కాబోతోంది. ప్రమోషన్ల వేగం కూడా పెంచుతోంది యూనిట్. దీంతో సైరాపై భారీ అంచనాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో సుపరిచితుడైన చిరంజీవిని మళ్లీ హిందీ స్క్రీన్ పై చూడాలనుందని ఇప్పటికే అక్కడి ప్రేక్షకులు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. మరో రెండు వారాల్లో విడుదల కానున్న సైరా ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: