మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘోరంగా ఓడిపోయారు. చిరంజీవి సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ కెరియర్ గురించి షాకింగ్ విషయాలు తెలిపారు నటుడు సుదీప్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా నటించి సుపరిచితులు అయ్యారు సుదీప్.


ఆ తర్వాత 'బాహుబలి' సినిమాలో కూడా నటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా 'సైరా' లో ఓ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఈ సందర్భంగా నటుడు సుదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సుదీప్ చిరంజీవి గురించి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. సినిమారంగంలో వచ్చే క్రేజ్...చూసి ఎప్పుడు మురిసిపోను అని తెలిపారు. స్టార్ డం అనేది రిలేషన్ షిప్ లాంటిదని.. ఈరోజు మనతో ఉంటుంది.. రేపు మరొకరితో ఉంటుందని అన్నారు.


కానీ ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇక చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన నుండి ఓ విషయం బాగా నేర్చుకున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి మాత్రం వెళ్లకూడదని అది చిరు సర్ నుండే నేర్చుకున్నట్లు చెప్పారు. ఎప్పటి నుండో సినిమా ఇండస్ట్రీ లో ఉన్నాను సినిమా ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే ఆయా పార్టీల నుండి ఆహ్వానాలు వస్తున్నాయని కానీ నాకు రాజకీయాలంటే ఇష్టం ఉండదు తెల్లారితే ఎవర్నో ఒకర్ని విమర్శించాలి అటువంటి బతుకు నాకు ఇష్టం లేదు అంటూ సుదీప్ చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: