మహేష్ బాబు సినిమాల్లో మాస్ ను బాగా ఆకట్టుకున్న సినిమాల్లో పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి.  ఆ సినిమాలో పూరి రాసిన డైలాగ్స్ నిజంగా సూపర్ అని చెప్పొచ్చు.  మాస్ పల్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.  మహేష్ బాబు సైలెంట్ గా చెప్పే డైలాగులు థియేటర్లో విజిల్స్ వేయించాయి.  ముఖ్యంగా బిజినెస్ మెన్ డైలాగులు.    మాములుగా అందరిలా బతకడానికి ముంబై రాలేదు.  ముంబై ని ఉచ్చ పోయించడానికి వచ్చా అనే డైలాగ్ సూపర్.  


దీంతో పాటు ఇంకో డైలాగ్ ఉంటుంది.  ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూషన్ చేయకండి.. ఆ కన్ఫ్యూషన్ లో ఇంకా ఎక్కువ కొట్టేస్తా.. ఈ డైలాగ్ సూపర్.  చుట్టూ ఎవరైనా పదిమంది ఉన్నప్పుడు.. పదిమంది చేరి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు.. ఒక మనిషిని పదిరకాల సమస్యలు చుట్టుముట్టినపుడు ఇలాంటి మహేష్ బాబు డైలాగ్ గుర్తుకు వస్తుంది. కానీ, ఆ సినిమాలో మహేష్ లాగ పోరాటం చేయడానికి ముందుకు రారు.  ఎందుకంటే అది సినిమా.  ఇది జీవితం.  


సినిమా వేరు జీవితం వేరు కదా.  సినిమాలో ఎన్నైనా చెయ్యొచ్చు.  కానీ, రియల్ లైఫ్ లో అలాంటివి చేయడం కుదరదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు. మహేష్ బాబును రౌడీలు రౌండప్ చేసినట్టుగానే కొన్ని పిల్లులు ఓ చిన్న పామును చుట్టుముట్టాయి.  అవి చుట్టూ చేరి ఎటాక్ చేయడనికి సిద్ధం కావడంతో.. పాపం ఆ చిన్న పాము కన్ఫ్యూషన్ అయ్యింది.  ఏం చేయాలో తెలియదు. అలర్ట్ గా పడగవిప్పి సిద్ధంగా ఉన్నది.  


ఈలోగా వెనుకనుంచి ఓ పిల్లి పాము పడగపై కొట్టింది.. ఆ పాము బుస్సున లేచింది.. ఆ పక్కనే ఉన్న నల్లపిల్లిపై ఎటాక్ చేసేందుకు ముందుకు ఉరికింది.  ఆ పిల్లి తప్పించుకోవడంతో పాము పక్కనే ఉన్న చెట్ల మధ్యలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది.  మహేష్ బాబు సినిమా కాబట్టి రౌడీలను కొట్టాడు.  కానీ, ఇక్కడ చిన్న పాము నాలుగు పిల్లులను ఎదుర్కోవాలి అంటే కష్టం.  అందుకే పారిపోయింది.  ఈ సంఘటన బైపాస్ రోడ్ అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ పక్కన జరిగింది.  ఆ దృశ్యాలను నటుడు నీల్ నితిన్ మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.  దాదాపు లక్షమందికి పైగా వీడియో ను చూశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: