గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి సినిమా సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం దేవత సినిమాలోని వెల్లువచ్చి గోదారమ్మ సింగ్ ను రీమిక్స్ చేశారు.  అప్పట్లో శ్రీదేవి ఎలాంటి డ్రెస్ వేసుకున్నదో అలంటి డ్రెస్ లోనే పూజా హెగ్డే కూడా కనిపించింది.  రాఘవేంద్ర రావు సినిమా కోసం బిందెలను వినియోగించారు. అదే విధంగా ఇందులో కూడా బిందెలను వినియోగించారు.  


పూజా హెగ్డే పాత్రకు శ్రీదేవి అనే పేరు పెట్టడం వెనుక కారణం ఉన్నది.  గద్దలకొండ గణేష్ ఓ గ్యాంగ్ స్టర్.. మారిపోయిన గ్యాంగ్ స్టర్.  యంగ్ గా ఉన్నప్పుడు గణేష్ రౌడీగా ఉండేవాడు.  కాలేజీలో రౌడీయిజం చేసేవాడు.  1980 ప్రాంతానికి చెందిన కథ.  పైగా అప్పట్లో శోభన్ బాబు, శ్రీదేవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.  దీనిప్రకారం పూజా హెగ్డే శ్రీదేవి అభిమాని. దానికోసమే ఆమెకు శ్రీదేవి అనే పేరు పెట్టారు.  శ్రీదేవి పాత్రలో పూజా హెగ్డే కనిపించేది కొద్దిసేపే అయినా.. గద్దలకొండ గణేష్ ను ప్రేమలో పడేస్తుంది.  


గణేష్ ను రౌడి నుంచి మాములు వ్యక్తిగా మారుస్తుంది.  మాములు వ్యక్తిగా మారడానికి గల కారణాలు ఏంటి అనే దాని చుట్టూ కథ నడుస్తుంది.  గుబురుగడ్డం, చేతిలో గన్నుతో రఫ్ గా ఉండే గణేష్ ఏం చేశాడు అన్నది కథ.  కథను హరీష్ శంకర్ ఎలా తీశాడో తెలియాలంటే సెప్టెంబర్ 20 వరకు ఆగాల్సిందే.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  హీరోకు నెగెటివ్ టచ్ ఇస్తూ.. చివరకు కథను పాజిటివ్ గా మార్చే కథలతో సినిమాలు చేయడంలో హరీష్ శంకర్ సిద్ధహస్తుడు.  


పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.  చాలా బిజీగా ఉన్న ఆర్టిస్ట్. డీజే సినిమా తరువాత పూజా కెరీర్ జెడ్ స్పీడ్ తో దూసుకుపోతున్నది.  అరవింద సమేత, మహర్షి సినిమాలతో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.  ఇప్పుడు జాన్, అల వైకుంఠపురంలో సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.  ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా పూజా చేతిలో ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: