‘సైరా’ మూవీని రామ్ చరణ్ తన తండ్రికి ఒక అపూర్వమైన కానుకగా ఇవ్వబోతున్నట్లు చరణ్ అనేక సందర్భాలలో ఓపెన్ గానే చెప్పాడు. దీనికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం బాలీవుడ్ కోలీవుడ్ శాండల్ వుడ్ లకు చెందిన అనేకమంది కీలక నటీనటులను ఈ మూవీ కోసం రంగంలోకి దింపాడు చరణ్. ఈ సినిమా బడ్జెట్ 270 కోట్లు దాటిపోయినా టెన్షన్ పడని చరణ్ ఈ మూవీ గ్రాఫిక్స్ కోసమే 40 కోట్లు ఖర్చు పెట్టారు అన్న వార్తలు వచ్చాయి. అలాంటి అత్యంత భారీ సినిమాను ప్రమోట్ చేసే విషయంలో చరణ్ ఫెయిల్ అయ్యాడా ? అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల ప్రమోఖులు గుసగుసలు ఆడుకుంటున్నట్లు టాక్. 

వాస్తవానికి ఇలాంటి గాసిప్పులు రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. ‘సైరా’ విడుదలకు ఇక మిగిలి ఉంది కేవలం రెండు వారాలు మాత్రమే. అయితే ఈమూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఆమధ్య ముంబాయ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ తప్ప ఇక ఎక్కడా ఏ ప్రమోషన్ కార్యక్రమం జరగలేదు. 

వాస్తవానికి ఈ మూవీ తమిళ కన్నడ మళయాళ భాషలలో డబ్ చేయబడి విడుదల అవుతున్నా ఈ మూవీకి సంబంధించిన వార్తలు తమిళ కన్నడ మళయాళ మీడియాలలో కనిపించడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా ‘సాహో’ విడుదలకు రెండు వారాలకు ముందే ‘సాహో’ వార్తలు అన్ని భాషల మీడియాలలో కనిపించాయి. ప్రభాస్ ఏకంగా 12 రోజులపాటు రోజుకు రెండు ప్రధాన నగరాల చొప్పున తిరిగుతూ తన మూవీ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. ఆ కష్టపడిన ఫలితం వల్లనే ‘సాహో’ కు టోటల్ నెగిటివ్ టాక్ వచ్చిన్నా 450 కోట్ల కలక్షన్స్ కు దరిదాపుకు చేరుకుంది. 

‘సాహో’ ప్రమోషన్ విషయంలో ప్రభాస్ చూపించిన చొరవ నిర్మాతగా చరణ్ ఎందుకు చూపించలేకపోతున్నాడు అంటూ కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చరణ్ నిర్మాతగా రాణించలేకపోయాడు అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడ చేస్తున్నారు. అయితే ప్రమోషన్ విషయంలో చరణ్ తనదైన కొన్ని పద్ధతులు ఉన్నాయని ఆ విషయాలు తెలియక కొందరు చరణ్ వ్యతిరేకులు అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు అంటూ చరణ్ సన్నిహితులు ఈ నెగిటివ్ ప్రచారం పై స్పందిస్తున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: