Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 5:39 am IST

Menu &Sections

Search

సినిమా తాజా వార్తలు ....

సినిమా తాజా వార్తలు ....
సినిమా తాజా వార్తలు ....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విజయ్ దేవరకొండ కొత్త సినిమా... టైటిల్ ప్రకటన రేపే...

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఆ తరువాత సినిమాను ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ రాకపోవడంతో, ఈ సినిమా షూటింగు నడుస్తుందా? ఆగిపోయిందా? అనే సందేహం తలెత్తింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ను రేపు ఉదయం 11 గంటలకు రివీల్ చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు ఒక పోస్టర్ ను వదిలారు. క్రియేటివ్ కమర్షియల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండకి ఇది 9వ సినిమా అనే సంగతి తెలిసిందే.  


'ఆర్.డి.ఎక్స్ లవ్'... రిలీజ్ డేట్ ఫిక్స్...

'ఆర్.ఎక్స్ 100' సినిమాతో పాయల్ రాజ్ పుత్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమాలో ఆమె హాట్ హాట్ గా కనిపించడంతో, ఆమె నుంచి ఆ స్థాయి సినిమా కోసం వాళ్లంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె 'ఆర్.డి.ఎక్స్ లవ్' సినిమా చేసింది.'హుషారు' ఫేమ్ తేజస్ హీరోగా నటించిన ఈ సినిమాను సి. కల్యాణ్ నిర్మించగా, శంకర్ భాను దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ధ్రువీకరించారు. ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సీనియర్ నరేశ్ .. ఆమని .. తులసి .. నాగినీడు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.  


అల్లుఅర్జున్ కొత్త సినిమా...ప్యారిస్ కి 'అల వైకుంఠపురములో' టీమ్...

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసినివారు నిర్మిస్తున్నారు. ఆ మధ్య కాకినాడలో ఈ సినిమా కోసం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో వేసిన ఖరీదైన సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.తదుపరి షెడ్యూల్ ను ప్యారిస్ లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం. వచ్చేనెల మొదటివారంలో ప్యారిస్ లో ఈ షెడ్యూల్ షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలతో పాటు, ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో 'టబు' కీలకమైన పాత్రలో కనిపించనుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


మహేశ్ కోసం అనుకున్న కథను... రణబీర్ తో చేయనున్న సందీప్ రెడ్డి...

తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆ తరువాత అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో చేసి హిట్ కొట్టాడు. దాంతో సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి అక్కడి స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. వాళ్లలో రణబీర్ కపూర్ తో సినిమా చేయడానికి సందీప్ రెడ్డి సిద్ధమవుతున్నాడు.ఈ డార్క్ క్రైమ్ స్టోరీకి 'డెవిల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొన్నాళ్ల క్రితం మహేశ్ బాబుతో తెలుగులో ఒక సినిమా చేయాలని సందీప్ రెడ్డి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే కథను సందీప్ రెడ్డి .. రణబీర్ కి చెప్పి ఒప్పించాడని అంటున్నారు. ఈ సినిమాను మరింత బోల్డ్ గా .. రఫ్ గా తీయనున్నట్టు సందీప్ రెడ్డి ముందుగానే చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


latest tollywood movie news..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోడి కత్తి, బాబాయ్ హత్య... ఏమయ్యాయి సీఎం గారు?
తనే నా డార్లింగ్,నా రాణి లేకపోతే నేను ఉండేవాడ్ని కాదు అంటున్న అగ్ర దర్శకుడు..
ఎన్ని ఉన్నా ఆవకాయ,నెయ్యి తరువాతే అంటున్న ఆరు అడుగుల ఆజానుబాహుడు..
గోటితో పోయేదానికి,గొడ్డలి అవసరం అంటూ జేసీ వ్యాఖ్యలు...
కేంద్రం కీలక నిర్ణయం..రబి పంటల మద్దతు ధర పెంపు
మా అధ్యక్షుడు నరేష్ -హేమల మాటల యుద్ధం..కడిగిపారేసిన హేమ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ బర్త్ డే నేడు ..
15 సార్లు కత్తితో దారుణంగా పొడిచి,చివరికి ముఖంపై కూడా బులెట్ దించారు.
బ్రేకప్‌ మనకు ఎన్నో విలువైన గుణపాఠాలను నేర్పుతాయి,కలిసి బాధ పడేకన్నా బ్రేకప్ బెటర్ అంటున్నారు.
కార్మికులతో చర్చలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్...
అసలు ఏం జరిగింది ..? కచ్చలూరు గోదావరి పడవ ప్రమాదంలో..
పాకిస్థాన్ మాజీ ప్రధాని...నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో
రైతులకు మేలు.. మరొక కీలక నిర్ణయంతో తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
బన్నీ,రాములో రాములా సాంగ్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది...
అత్యంత నిజాయితీపరుడు ఆయనే: బీజేపీ ఎమ్మెల్యేపై రాహుల్ ఎద్దేవా
ఉధృతంగా మారిన ఆర్టీసీ సమ్మె.. హైకోర్టుకు మరో 3 పిటిషన్లు
బాబోయ్.... ప్యాసింజరా...? మా వల్ల కాదు
గాంధీ జాతిపిత కాదు,బిడ్డ మాత్రమే...బీజేపీ ఎంపీ సాధ్వీ
ఎన్నికల్ని బహిష్కరించిన గ్రామం..ఇది మహారాష్ట్ర,మనిబేలిలో చోటుచేసుకున్న ఘటన..
వెనుక ఆయన ఉండబట్టే కదా...! ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మరోసారి.
సమ్మె కొనసాగుతున్నా..ఆర్టీసీ యాజమాన్యం వచ్చిన ఆదాయం ఎం చేసినట్టు?
రాంగ్‌ ప్లేస్‌లో పార్క్‌..భోలో తా రా రా... క్రేన్‌ తీసుకురా రా...!
ఓ స్త్రీ..! ఐరన్ నీ నరనరాల్లో ప్రవహించాలి.
ఆనంద దీపావళికి వయసుల వారీగా బాణాసంచా...!
కంటి వెలుగుకి కళ్ళు తిరిగే లెక్కలు...!!
ఆయన చెల్లిని గెలిపించుకోలేకపోయాడు.. కానీ నేను నా అ‍క్కను గెలిపించుకుంటా...!
బిగ్ బి అమితాబ్ బాటలో రాధిక శరత్ కుమార్...
స్వల్ప సమయంలోనే ..పెద్ద ఛాన్స్ కొట్టిన కెజిఎఫ్ భామ శ్రీనిధి
పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు పేరుతో కొత్త ఆరోగ్యశ్రీ ప్రారంభం..
క్రిస్మస్ మొదలుకొని సంక్రాంతి,వాలెంటైన్స్ డే వరుకు కొనసాగబోతున్న..సినిమాల హవా
విక్రమ్ వేద సినిమా బాలీవుడ్ రీమేక్ కు ఇద్దరు బడా స్టార్లు గ్రీన్ సిగ్నల్..
రాగల 24 గంటల్లో..అదిరేటి స్టెప్పులతో బర్నింగ్ స్టార్ సంపూ
రీమేక్ పై అసలు నీకైనా క్లారిటీ ఉందా నితిన్? అప్డేట్ ఎప్పుడు అంటున్న ఫాన్స్
మైత్రి మూవీమేకర్స్ పై నిప్పులు కురిపిస్తున్న మెగా,నందమూరి ఫ్యాన్స్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.