2019 సంవత్సరంలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబడిన చిత్రాలు సాహో మరియు సైరా. ఇప్పటికే సాహో సినిమా విడుదలైంది. మరో 15 రోజుల్లో దసరా పండుగ కానుకగా సైరా సినిమా విడుదల కాబోతుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర, ఈగ, బాహుబలి, బాహుబలి 2 సినిమాలలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటం ఆ సినిమా విజయాలకు కొంతవరకు కారణమైంది. ప్రేక్షకులు ఇప్పుడు గతంలోలాగా నాసిరకం గ్రాఫిక్స్ సినిమాలు తీస్తే ఆదరించటం లేదు, 
 
అందువలన భారీ బడ్జెట్లతో సినిమాలు నిర్మించే నిర్మాతలు గ్రాఫిక్స్ కోసమే కొంత బడ్జెట్ కేటాయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా గ్రాఫిక్స్ కోసం నిర్మాత రామ్ చరణ్ 45 కోట్ల రుపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది. 16 కంపెనీలు సైరా సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం పని చేస్తున్నట్లు సమాచారం. 
 
సైరా సినిమాలోని గ్రాఫిక్స్ తో కూడిన సన్నివేశాలు అత్యంత సహజంగా వచ్చేలా మూవీ మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. దాదాపు 270 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో సైరా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 22 వ తేదీన జరగబోతుంది. మొదట 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని భావించినా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 
 
కానీ సైరా థియేట్రికల్ ట్రైలర్ మాత్రం ముందుగా ప్రకటించిన విధంగా రేపు విడుదల కాబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వి వి వినాయక్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారని సమాచారం. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: