నేచుర‌ల్ స్టార్ నాని గ్యాంగ్ లీడ‌ర్ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. విక్ర‌మ్ కె.కుమార్ డైరెక్ష‌న్‌, గ్యాంగ్ లీడ‌ర్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్ క‌లిసి రావ‌డంతో ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. గ‌త రెండు సినిమాల‌తో నిరాశ‌ప‌రిచిన నాని ఈ ఏడాది వేసవిలో విడుదలైన జెర్సీ విజయంతో రైజింగ్‌లోకి వ‌చ్చాడు. జెర్సీ క్లాస్ మూవీగా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.


సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా కూడా వ‌సూళ్ల‌లో ఓ మోస్త‌రుగా వెళుతోంది. గ్యాంగ్ లీడ‌ర్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌గా... ఇప్ప‌టికి రూ.13 కోట్లు సాధించింది. మ‌రో రూ.8 కోట్లు సాధిస్తేనే ఈ సినిమా ఇక్క‌డ బ్రేక్ ఈవెన్‌కు వ‌స్తుంది. అయితే సినిమా సోమ‌వారానికి స్లో అవ్వగా... మంగ‌ళ‌వారం ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌ల ప్ర‌కారం మ‌రింత స్లో అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ట్రేడ్‌లో కూడా టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది.


వ‌చ్చే వారం థియేట‌ర్ల‌లోకి వ‌రుణ్‌తేజ్ వాల్మీకి, సూర్య డ‌బ్బింగ్ సినిమా బందోబ‌స్త్ వ‌స్తున్నాయి. మరి ఈ నేప‌థ్యంలో గ్యాంగ్ లీడ‌ర్‌కు బుధ‌, గురువారాలు మాత్ర‌మే ఉన్నాయి. మ‌రి ఈ రెండు రోజుల్లో ఎంత రిక‌వ‌రీ చేస్తుందో ?  చూడాలి. ఈ సినిమాలో నాని స‌ర‌స‌న ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నాలుగు రోజుల వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.


గ్యాంగ్ లీడ‌ర్ 4 డేస్ ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్ల‌లో) :


నైజాం - 5.20


సీడెడ్ - 1.60


వైజాగ్ - 1.73


గుంటూరు - 1.15


ఈస్ట్ - 1.13


వెస్ట్ - 0.75


కృష్ణా - 1.01


నెల్లూరు - 0.40
-------------------------------------
ఏపీ + తెలంగాణ = 12.97 కోట్లు
-------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: