మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ యేడాది సంక్రాంతికి ఎఫ్ 2 రూపంలో కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వ‌రుణ్ మార్కెట్ రేంజ్ బాగా పెరిగింది. ఇక వ‌రుణ్ లేటెస్ట్ సినిమా వాల్మీకి. మీడియం రేంజ్ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 20 కోట్ల రూపాయలకు అమ్మారు.


ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే 25 కోట్ల రూపాయలకు ఈ సినిమా అమ్ముడ‌పోయింది. డీజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఆల్రెడీ కోలీవుడ్‌లో జిగ‌ర్‌తండా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తుండ‌డంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది.


అప్పటివరకు తటపటాయించిన వెస్ట్, గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతలు చెప్పిన మొత్తాలకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అటుఇటుగా 22 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా చూసుకుంటే వాల్మీకి బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ.26 కోట్ల నెట్ రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా రూ.45 - 50 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌స్తే గాని ఈ సినిమా కొన్న వారు సేఫ్ కారు. మ‌రి వ‌రుణ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో ?  చూడాలి.


వాల్మీకి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది (రూ.కోట్ల‌లో) :


నైజాం – 7.40 కోట్లు


సీడెడ్ – 3.35 కోట్లు


ఉత్తరాంధ్ర – 2.40 కోట్లు


ఈస్ట్ – 1.60 కోట్లు


వెస్ట్ – 1.10 కోట్లు


గుంటూరు – 1.80 కోట్లు


నెల్లూరు – 0.75 కోట్లు


కృష్ణా – 1.60 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: