డైరెక్టర్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీ సినిమా దబాంగ్ ను రీమేక్ చేసి విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు. రీమేక్ చేయడం అంటే హరీష్ తర్వాతే ఏ డైరెక్టర్ అయిన అన్నంతగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ నుండి వచ్చిన దాదాపు అన్ని తమిళ సినిమాలు రీమేక్ సినిమాలే. వాటిలో ఎక్కువగా విక్టరీ వెంకటేష్ తోనే రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యోది రీమేక్ చేయడం పెద్ద తప్పు కాదు, నేరము కాదు. కానీ ఆ విషయాన్ని డైరెక్టర్స్ ఎందుకనో ఒప్పుకోలేపోతున్నారు. రీమేక్ సినిమాలు చేసే దర్శకులు తాము చేసేపని తప్పు అయినట్టుగా జనాలను కన్వీన్స్ చేయడానికి ఏవేవో థియరీలు చెబుతూ ఉంటారు. 

ఈ మధ్యనే 'రాక్షసుడు' సినిమాను రీమేక్ చేసిన దర్శకుడు.. రీమేక్ చేయడం సులభంకాదని, శంకర్ వంటి దర్శకుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడంటూ ఏదేదో సోది చెప్పుకొచ్చాడు. రీమేక్ చేయడం చాలాకష్టం.. అలాంటి కష్టాన్ని తను పడినట్టుగా చెప్పుకొచ్చాడు. అంటే రీమేక్ చేయడమే అంత కష్టం అయితే.. ఒరిజినల్ సినిమాను చేయడం ఎంతకష్టమో కూడా చెప్పాలి కదా..!

ఇక 'జిగర్తాండా'ను రీమేక్ చేసిన హరీష్ శంకర్ అయితే ఇప్పుడు మరో థియరీ చెప్పేస్తున్నారు. ప్రతి సినిమా కూడా రీమేకేనట! ఒరిజినల్ అంటూ ఏదీ ఉండదట. ప్రతి ఒక్కటీ రీమేకనేట. ప్రతి సినిమానూ ఏదో ఒక కథ నుంచో, నవల నుంచో, సంఘటన నుంచి స్ఫూర్తిపొందో రూపొందిస్తారు కాబట్టి.. ప్రతిదీ రీమేకే అని ఈయన చెప్పుకొచ్చాడు! ఇదంతా ఎందుకు..నేను రీమేక్ చేశాను అంటే అయిపోతుంది కదా. 

'ఔను రీమేక్ చేశాం..' అంటూ ఈ దర్శకులు ఒకే మాటతో ఎందుకు ముగించలేకపోతున్నారో! జనాలకు అంతు చిక్క ని థియరీలు చెబుతూ ఉంటే రీమేక్ చేశారనే విషయం ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఒరిజినల్ తమిళ వెర్షన్ తో పోలిస్తే తెలుగు వెర్షన్లో భారీ మార్పులు లేవని హరీష్ శంకర్ అంటున్నాడు. తెలుగు వెర్షన్లో నితిన్, బ్రహ్మానందం, సుకుమార్ లు గెస్ట్ అప్పీరియన్స్ ఉంటుందన్నాడు. అంటే ముందుగానే ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్నారా...ఈ సినిమాలో ఆశించే అంశాలు ఉండవని..అన్న అనుమానం కలుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: