దగ్గుబాటి వారసుడు రానా విలన్ హీరో అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి సినిమాలో భళ్లాలదేవాగా రానా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్ అంత పవర్ ఫుల్ గా ఉన్నాడు కాబట్టి హీరో అంత బాగా ఎలివేట్ అయ్యాడు. అయితే బాహుబలి విషయంలో ప్రభాస్, రానా పోటా పోటీగా నటించారు.


ప్రస్తుతం రానా తెలుగులో విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. 1945 సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. హౌజ్ ఫుల్ 4లో కూడా నటిస్తాడని అంటున్నారు. ఇవే కాకుండా గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


అయితే ఈ సినిమలతో పాటుగా ఓ కొరియన్ మూవీ చూసిన రానా ఆ సినిమాను తెలుగు రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. ఆ సినిమా హక్కులను సొంతం చేసుకున్న రానా మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అయితే బాగుంటుందని చెప్పాడట. నందని రెడ్డి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ రానా సినిమా చేయనని చెప్పేసిందట. మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. ప్రస్తుతం మిస్ ఇండియా సినిమా చేస్తున్న కీర్తి సురేష్ ఈమధ్యనే కోలీవుడ్ లో ఫీమేల్ లీడ్ సినిమాకు ఓకే చెప్పింది. మళ్లీ సంవత్సరం వరకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో రానా సినిమాకు కీర్తి సురేష్ నో చెప్పక తప్పలేదట. అయితే రానా స్టార్ కాదు కాబట్టే కీర్తి అతనితో చేయనని చెప్పిందని కొందరు అంటున్నారు. తమిళంలో కెరియర్ స్టార్టింగ్ లో శివ కార్తికేయన్ లాంటి యువ హీరోలతో చేసింది కీర్తి.. మరి అలాంటిది టాలీవుడ్ క్రేజీ హీరో అయిన రానాతో ఎందుకు చేయదని అంటున్నారు. నిజంగనే అమ్మడు డేట్స్ వల్లే ఆ సినిమా మిస్సైందని టాక్.
 


మరింత సమాచారం తెలుసుకోండి: