మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెంచేసాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు హరీష్ మరియు హీరో వరుణ్ తేజ్ లు మాట్లాడుతూ, తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసారు. 

ఇప్పటివరకు మంచి క్లాస్ మరియు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రల్లో నటించిన వరుణ్, ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ అనే ఊర మాస పాత్రలో నటిస్తున్నాడు. ఇక మరోవైపు ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ కూడా మంచి మాస్ బాణీలు ఇచ్చి మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపడం జరిగింది. ఇకపోతే సోగ్గాడు శోభన్ బాబు మరియు శ్రీదేవిల కాంబినేషన్లో 1982లో వచ్చిన దేవత సినిమాలోని వెల్లువొచ్చి గోదారమ్మ అనే సూపర్ హిట్ సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేయడం జరిగింది. అయితే అదే పాటను మళ్ళి ఎస్పీ బాలు గారు మరియు సుశీల గారితో పాడించినట్లు తెలుస్తోంది. 

ఇక మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, నేడు ఈ సాంగ్ వీడియో ప్రోమో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. అచ్చంగా శోభన్ బాబు, శ్రీదేవిలను పోలినట్లుగా వరుణ్ మరియు పూజలు ఈ పాటలో అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో విపరీతమైన వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. మరొక్క మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంతమేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: