Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 11:59 pm IST

Menu &Sections

Search

న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !

న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'అల వైకుంఠపురములో'..  ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన బన్నీ,  తన  స్టైలిష్ లుక్ తో మొత్తానికి అభిమానులను ఫిదా చేశాడు.  కాగా ఈ సినిమా  తరువాత షెడ్యూల్ కోసం చిత్రబృందం అతి త్వరలో పారిస్‌ కు వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలోని  రెండు సాంగ్స్ ను  పారిస్ లో  తీయనున్నారని తెలుస్తోంది.  అయితే  ఈ సాంగ్స్ కోసం బన్నీ న్యూ లుక్ లో కనిపిస్తాడట. ఇప్పటికే న్యూ లుక్ బన్నీ కసరత్తులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమా టీజర్ ను  మొదట నవంబర్ 7న  త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా  విడుదల చేయనున్నా  ఆ తరువాత మనసు మార్చుకుని..  అక్టోబర్  8న దసరా స్పెషల్‌ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.  ఇక వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో  ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఇక  ఈ సినిమా  డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా..  శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఏమైనా ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా  రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని సమాచారం.  బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  పైగా  ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ,   ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. 

 

అందుకే ఈ చిత్రానికి  ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు.   ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన  పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తోంది.  పూజా హెగ్డే ఇప్పటికే  డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది.  అలాగే ఈ సినిమాలో  సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా  కీలక పాత్రలో  నటిస్తోంది.  కాగా  తమన్ సంగీతం అందిస్తోన్న  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు  హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  కాగా ఇప్పటికే ఈ సినిమాకి తమన్,  ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట.  బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో  ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని  తెలుస్తోంది.  


stylish star  Allu Arjun's new look for  Ala Vaikunthapuramlo's songs 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ ఇలాగే  కొనసాగితే..  సీఎం అవ్వడం ఖాయం !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
తెరాస నుండి వలసలు మొదలవుతాయా  ?
'అల వైకుంఠపురములో'.. సంచలనాలు !
'ఆర్ఆర్ఆర్' టైటిల్  ఇదేనా ?
బాలయ్య సినిమాల పై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.