బిగ్ బాస్ హౌజ్ లో గొడవలు, రచ్చలు, కేసులు, ఎఫైర్లు.. కొత్తేమి కాదు. హిందీ, తమిళ బిగ్ బాస్ హౌజ్ లో ఇలాంటివి చాలానే జరిగాయి. కానీ తెలుగు బిగ్ బాస్ కు మాత్రం ఇలాంటి హాట్ హాట్ ఎఫైర్లు, రొమాన్స్ అనేవి చాలా కొత్త. ఫస్ట్ టైమ్ అలాంటి ఓ అనుబంధం హౌజ్ లో గట్టిగా పెనవేసుకుంటోంది. అదే రాహుల్-పునర్నవి రిలేషన్ షిప్. అయితే ఇది కేవలం హౌజ్ కే పరిమితమా లేక వాళ్లిద్దరూ నిజంగానే క్లోజ్ అవుతున్నారా అనేది పెద్ద సందేహంగా ఉంది.

రాహుల్-పునర్నవి చాలా క్లోజ్ అవుతున్నారనే విషయం బిగ్ బాస్ సీజన్-3 ఫాలో అవుతున్న ప్రేక్షకులకు అర్థమౌతూనే ఉంది. నాగార్జున కూడా దాదాపు ఇదే అభిప్రాయంలో ఉన్నారు. తాజాగా హౌజ్ లో జరిగిన ఓ టాస్క్ లో వీళ్లిద్దరి మధ్య పెనవేసుకుంటున్న బంధాన్ని మరింతగా బలపరచింది. కేవలం వీళ్లిద్దర్నీ టార్గెట్ చేస్తూ ఓ టాస్క్ డిజైన్ చేశారు బిగ్ బాస్. పునర్నవి కోసం రాహుల్ వాంతులు చేసుకుంటూ మరీ కాకరకాయ రసం తాగేశాడు.

ఈ చిన్న టాస్క్ తో పునర్నవి చలించిపోయింది. రాహుల్ ను గట్టిగా కౌగిలించుకుంది. ఓ ఘాటైన ముద్దు పెట్టేసింది. ఒకరకంగా సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ చూసినట్టు అందరికి అనిపించింది. ఈ ఒక్క ముద్దుతో వీళ్లిద్దరి రిలేషన్ షిప్ పై అనుమానాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఇదంతా టాస్క్ లో భాగమేనా, నిజంగా వీళ్లిద్దరు దగ్గరయ్యారా అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. 

బిగ్ బాస్ సీజన్-3 స్టార్ట్ అయినప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం కనిపించింది. టాస్క్ ల కోసం ఓవైపు కొట్టుకుంటూనే, రాత్రి అయ్యేసరికి ఇద్దరూ ఓ చోట చేరి కబుర్లు చెప్పుకునే వాళ్లు. లవ్, మ్యారేజ్, డేటింగ్ లాంటి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. తాజాగా జరిగిన ఘటనతో వీళ్లిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారనే విషయంలో అందరికి ఒక క్లారిటి వచ్చేసింది. మరి ఈ ఇద్దరు హౌజ్ నుండి బయటకు వచ్చాక కూడా ఇదే రిలేషన్ కంటిన్యూ చేస్తారా లేదా అన్నది బిగ్ బాస్ సీజన్ -3 అయ్యాక గాని అర్థమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: