మొదటి నుంచి రకుల్ ప్రీత్ కమర్షియల్ బ్యూటీగా పేరు తెచ్చుకోవడమే గాక తనకొచ్చిన డబ్బులను పెట్టుబడులుగా పెట్టడంలో ముందువుంటుంది.ఇప్పటికే F45పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది.ఇక తెలుగు టాప్ హీరోయిన్‌‌లలో ఒకరుగా కొనసాగుతున్న రకుల్ జోరు ఈ మధ్యన కాస్తంత తగ్గింది.కారణం ఈ భామ చేసిన సినిమాలు అంతగా అలరించలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి.దీంతో తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి.ఈ కారణంగా ఆ మధ్య హిందీ సినిమాలపై దృష్టి పెట్టిన రకుల్..అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది.



ఆ తరువాత ఈ భామ తెలుగులో నాగార్జున సరసన చేసిన 'మన్మథుడు 2 ' ఈ మధ్యే విడుదలైన ఫ్లాప్ కావడంతో మూలిగే నక్కపై తాటిపండు చందాన..రకుల్ కెరీర్‌కు తెలుగులో పెద్ద దెబ్బే పడింది.దాంతో ఆఫర్స్ వచ్చినా రాకపోయినా తనకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ హాయిగా బతికేస్తోంది రకుల్.ఇటూ సినిమాలు చేస్తూనే ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టింది రకుల్. ఆమె టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ఓ జట్టుకి కో ఓనర్‌గా మారింది. ఈ  విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.అది అలా ఉండగా..సినిమాల కోసం సన్నగా మారిన రకుల్..కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.



అసలు విషయం ఏంటని ఆరా తీస్తే ఈ మధ్య వీలున్నప్పుడల్లా జిమ్ లో అదరగొడుతోందట.తానొక్కతే చాటుగా జిమ్ చేస్తే ఫ్యాన్స్ ఫీలవుతారని అనుకుందేమో ఇటీవల మరోసారి జిమ్ చేస్తూ.. ఓ హాట్ వీడియో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో రకుల్ 170 పౌండ్‌ల బరువును ఎత్తి అదరగొట్టింది.దీనికి సంబందించిన ఓ వీడియోను రకుల్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా..రకుల్ అందాలకు ఫిదా అయ్యి అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు.రకుల్ జాగ్రత్త..ఏమాత్రం అదుపు తప్పిన ప్రాణాలకే ప్రమాదం..అంటున్నారు. మరికొందరూ అసలు బరువును అలా ఎత్తకూడదని.. చాలా ప్రమాదకర పద్దతిలో బరువును ఎత్తు తున్నారని,మరికొందరు మా గుండెల్ని పిండేస్తున్నావని ఇలా ఎవరికి తోచిన విధంగా వారు  కామెంట్స్ పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: