ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఒకటి టాలీవుడ్ నుంచి హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' కాగా… మరొకటి కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య, మోహన్ లాల్ మరియు ఆర్య ముఖ్య పాత్రల్లో నటించిన 'బందోబస్తు'. రిలీజ్ కి ముందు టాక్ గనుక పరిశీలిస్తే 'బందోబస్త్' కన్నా 'వాల్మీకి' కే క్రేజ్ ఎక్కువ అని చెప్పాలి. వరుణ్ తేజ్ విలన్ లుక్కులో మామూలుగా ఇరగ తీయలేదు మరి. ఇకపోతే 'బందోబస్త్' ట్రైలర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ వరుణ్ తేజ్ 'వాల్మీకి' కలెక్షన్లకు సూర్య భారీ స్థాయిలో గండి కొట్టాడు.

తెలుగు చిత్రసీమలోనే కలెక్షన్ల పరంగా ప్రతిష్టాత్మకంగా భావించే నైజాం ఏరియాలో సూర్య 'బందోబస్త్' కి వచ్చిన స్క్రీన్లలో సగం స్క్రీన్లు కూడా వరుణ్ తేజ్ 'వాల్మీకి' సంపాదించలేకపోయింది. 'వాల్మీకి' సినిమా తీసుకున్న కొత్త డిస్ట్రిబ్యూటర్ ఇప్పటికే అనుకున్న దాని కన్నా 100 స్క్రీన్లు తక్కువ సంపాదించాడు. మరొకవైపు బందోబస్తు కోసం అసలైన స్ట్రాటీజిక్ మేకర్ దిల్ రాజు దగ్గర దగ్గర ఒక రెండు వందల స్క్రీన్లు సర్దేశాడు. హరీష్ శంకర్ పైన మెగా అభిమానులకి ఉన్న నమ్మకం, వరుణ్ బాబు అబ్బురపరిచే పర్ఫామెన్స్, పూజ హెగ్డే వంపులు, మరియు మాస్ ని హోరెత్తించే పాటలు ఏవీ కూడా సూర్య మేనియా అని అక్కడ ఆపలేకపోయాయి.

పుండు మీద కారం చల్లినట్లు నాని 'గ్యాంగ్ లీడర్' తన రెండవ వారం కోసం ఇప్పుడు ఆడుతున్న షో లలో చాలా శాతం ఉంచేసుకుంది. కాబట్టి వాల్మీకి మొదటి వారం కలెక్షన్లు నైజాం ఏరియా లో భారీగా పడిపోనున్నాయి. ఇప్పుడు వాల్మీకి నిలదొక్కుకోవాలంటే మొదటి రోజు నుంచే భారీ హిట్ టాక్ సంపాదించి.... సూర్య దగ్గర నుండి ఎన్ని వీలైతే అన్ని స్క్రీన్లు లాక్కోవాలి. టాక్ కొంచెం తేడా వచ్చినా నిర్మాతలు నెత్తిమీద తడి గుడ్డ వేసుకోక తప్పేలా లేదు పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: