బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే అతడి కోసం ఒక ఆర్మీ కూడా తయారైంది. ఒకదశలో ఇంటి సభ్యులు నామినేషన్ అయితే వారి ఓటింగ్ కూడా కౌశల్ ఆర్మి నిర్ణయించే స్థాయికి చేరుకుందని తెగ వార్తలు వచ్చేయి. ఈ విషయంలో నాని కూడా ఒక అడుగు వెనక్కి వేశారని..ఆ సమయంలో బిగ్ బాస్ రేటింగ్ పెంచాలన్నా..తగ్గించాలన్నా కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ చూపించేదని తెగ వార్తలు వచ్చేవి.  మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 కి కౌశల్ విన్నర్ గా నిలిచారు. 

ఆయన బయటకు వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ అంతా కలిసి కౌశల్ తో ఓ సినిమా తీయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది జరగకపోగా..తన సినిమా ఆపించారని కౌశల్ పలువురిపై ఆరోపణలు కూడా చేశారు.  ఇంటి బయటకు వచ్చిన తర్వా బాబు గోగినేని, తనిష్ తో పెద్ద గొడవలే జరిగాయి.  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత  కౌశల్ తనకు పీఎం ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, డాక్టరేట్ రాబోతుందని గొప్పలు చెప్పి నవ్వులపాలయ్యాడు.  అంతే కాదు కౌశల్ ఆర్మీ కూడా ఫేక్ ఆర్మీ అంటూ ప్రచారం జరిగింది. కౌశల్ ఆర్మీ ద్వారా ఏర్పాటైన ఫౌండేషన్ కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు వార్తలు వచ్చాయి. కౌశల్ ఆర్మీని నడిపించిన కొందరు అభిమానులు మీడియాకెక్కి కౌశల్ ఫ్రాడ్ అంటూ ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు.

తాజాగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న కౌశల్ ని మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న అడిగారు. బిగ్ బాస్ 3 లో టాప్ కంటెస్టంట్లలో ఎవరి పేరు అయినా చెప్తారా అనగానే..నో నో.. నేను ఇప్పుడు ఒకరి పేరు చెబితే నా ఆర్మీ మొత్తం  వారికే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని  చెప్పారు. ఈ నేపథ్యంలో కౌశల్ అసలు నీకు ఆర్మీ ఉందా..అది ఇంకా కంటిన్యూ అవుతుందా? చాల్లే నీ బడాయి అని అంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: