మెగా కాంపౌండ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ తీసిన ‘వాల్మీకి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మాఫియా లీడర్ గా వరుణ్ తేజ్ మొట్టమొదటిసారి నటిస్తున్నారు. దీంతో అనేక వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 20వ తారీకు న విడుదల కానుంది . ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ భవిష్యత్తులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేయాలని ఉందని ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని గతంలో ‘రామయ్య వస్తావయ్యా’ అనే సినిమాతో టైగర్ ని నిరాశపరిచిన కానీ కచ్చితంగా టైగర్ కి హిట్ అందిస్తాను బాకీ ఉండిపోయా అని పేర్కొన్నాడు.


జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో రామయ్య వస్తావయ్య సినిమా ఫ్లాప్ అవ్వడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం అయితే హరీష్ శంకర్ చేయాలని ఉన్నా గానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు అప్పుడే హరీష్ తో సినిమా చేసే ఆలోచనలో ఎన్టీఆర్ లేనట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. టెంపర్ సినిమా నుండి వరుస హిట్లు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్..అదే సక్సెస్ కెరియర్లో కొనసాగించడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.


ప్రస్తుతం రాజమౌళి తో చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వరుసగా చాలా మంది స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెట్టినట్లు ఇండస్ట్రీ లో టాక్ వినపడుతోంది. ఇదిలా ఉండగా వాల్మీకి సినిమా గురించి మరియు ఆ సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ గురించి అనేక విషయాలు డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. కాగా వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ మొట్టమొదటిసారి మాఫియా టైప్ క్యారెక్టర్ చేయడం తో సినిమాపై మెగా అభిమానులు గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: