తమ కన్నా వయసులో చిన్న వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ తెలుగు తమిళ్ హిందీ చిత్రాలలో చాలామంది ఉన్నారు. అలా చూసుకుంటే హిందీలో చాలా మంది ఉన్నారు. పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. స్వర్గంలో నిర్ణయించబడి ఉంటుంది. దానిని ఎవరు మార్చలేరు. సాధారణంగా పెళ్ళికి ఒక వయసు ఉంటుంది. అమ్మాయితో పోలిస్తే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలి. అప్పుడే అది సార్ధకం అవుతుంది. 

ఈ మధ్య కాలంలో చాలా మంది దానికి భిన్నంగా చేస్తున్నారు. తమకన్నా వయసులో చిన్నగా ఉన్న వారిని పెళ్లి చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ ఆ పద్దతిని అనావాయితిగా పాటిస్తున్నారు. అలా ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు చూద్దాము.. 

నమ్రత మహేష్ బాబు:

వంశీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నమత్ర శిరోత్కర్.. ఆ సినిమా తరువాత అంజి సినిమాలో చిరంజీవికి జతకట్టింది. ఆ తరువాత తెలుగులో మారె సినిమాలో కనిపించలేదు. అయితే, తనకన్నా రెండు ఏళ్ళు చిన్నవాడైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం మహేష్ భార్యగా ఇటు కుటుంబాన్ని, అటు మహేష్ సినిమా వ్యవహారాలను చూసుకుంటూ వస్తుంది. 

శిల్పా శెట్టి రాజ్ కుంద్రా :

సాగర కన్య శిల్పా శెట్టి అందరికి సుపరిచితురాలే.. తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించింది. అన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి. ఇకపోతే ఈమె బాలీవుడ్  కే అంకితమైంది.  ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో ప్రేమలో పడింది. కానీ చివరికి రాజ్ కుంద్రా అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లిచేసుకుంది. ఆమె కన్నా అతను కొన్ని నెలలు చిన్నవాడేనట. 

ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ :

బ్లూ ఐస్ బ్యూటీ ఐశ్వర్య అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. అన్ని భాషల్లో నటించింది. మిస్ వరల్డ్ అయినా ఐసు ఎన్నో సక్సెస్ చిత్రాలలో నటించింది. అభిషేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకన్నా అతగాడు వయసులో చిన్నవాడట. వీళ్లకు ఓ పాప కూడా ఉంది.

బిపాస బసు కరణ్ సింగ్ :

బాలీవుడ్ బ్యూటీ బిపాస బసు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. ఐటెం సాంగ్స్ లోను, హాట్ అందాలను ఆరబోస్తూ ఎన్ని హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. ఐతే ఈమె కొద్దీ రోజులు కరణ్ తో రీలేషన్ లో ఉండి మరి పెళ్లిచేసుకుంది. ఆమె కన్నా అతనికి మూడేళ్ళ ఏజ్ గ్యాప్ అట. 

అలా చూసుకుంటే అమ్రితా షింగ్ సైఫ్ అలీఖాన్ ను, అర్చన పురాణ సింగ్ పేరుమీత్ సేతి , ఫరాహ్ ఖాన్ సుందేరే లు కూడా తమకన్నా వయసులో చిన్న వాళ్ళను పెళ్లిచేసుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: