పూజా హెగ్డే... ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన పూజా హెగ్డే అందాల ప్రదర్శనలో ఏ మాత్రం అడ్డు చెప్పడం లేదు. త్వరలోనే వాల్మీకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూజా హెగ్డే.. దాదాపు ఆరేళ్ల క్రితం మెగా ప్రిన్స్.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ముకుందా’ సినిమాతో  తెలుగు తెరకు పరిచయమైంది.  ఆ తర్వాత వెంటనే.. నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు.. అనుకున్నంత  ఆడలేదు. దీంతో  అల్లు అర్జున్ 'డీజే' సినిమా వచ్చే దాకా పూజా హెగ్డేకు తెలుగులో గొప్పగా గుర్తింపు రాలేదు.  'డీజే' ఎప్పుడైతే.. హిట్ అయ్యిందో.. ఆ తరువాత నుంచి ఈ భామ కెరీర్ పరుగు లంకించ్చుకుంది.


మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. 1982లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చి గోదారమ్మా' పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ - 
''ఈ పాట కోసం దాదాపు 1500 బిందెలను ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి ముందుగా థాంక్స్‌. ఈ పాటలో వరుణ్‌ ఇచ్చిన కొన్ని రెట్రో ఎక్స్‌ప్రెషన్స్‌ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తాయి. అలాగే డ్యాన్స్‌ ఇరగదీశాడు. అలాగే ఈ క్యారెక్టర్‌, ఒకప్పటి ఐకానిక్‌ సాంగ్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్‌కి థాంక్స్‌. శ్రీదేవిగారు నాకు ఇన్‌స్పిరేషన్‌. లెజెండరీ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారు ఈ పాటతో ఒక మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు. ఇప్పుడు ఆయన మా సాంగ్‌ చూసి అభినందించి, మమ్మల్ని ఆశీర్వదించడం మేమెప్పటికీ మర్చిపోలేం. అలాగే ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా సంగీతాన్నిచ్చిన మిక్కీ, కొరియోగ్రఫీ చేసిన శేఖర్‌ మాస్టర్‌కి థాంక్స్‌'' అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: