డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అంటే అందరికి ముందు గుర్తుకువచ్చేది బ్యాంకాక్. ఈ డైరెక్టర్ కి కథ తయారు చేయడం లో బ్యాంకాక్ సెంటిమెంట్ చాలా ఉంటుంది. ఇలా బ్యాంకాక్ వెళ్లి, అలా ఓ వారం గడిపి, ఫుల్ స్క్రిప్ట్ తో వెనక్కురావడం పూరికి బాగా అలవాటు. బ్యాంకాక్ లో ఆయన హైదరాబాద్ లో తిరిగినంత ఈజీగా తిరిగేస్తారు. అక్కడ జనాలకు కూడా ఆయన పక్కాలోకల్ అన్నంత పరిచయం. అంతేకాదు వృద్ధాప్యం కూడా బ్యాంకాక్ లో గడపాలని ఇప్పుడే ఫిక్సైయ్యారు. అయితే ఈ మధ్య ఆయన బ్యాంకాక్ వెళ్ళడం తగ్గించేసారు. 

అలాంటి టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గట్టి హిట్ కొట్టారు. దాంతో ఇప్పుడు యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారు. ఆ స్క్రిప్ట్ రెడీ చేయడం కోసం పూరి జగన్నాధ్ మళ్లీ సూట్ కేస్ సర్దేసుకున్నారు. కాని ఈ సారి బ్యాంకాక్ కు కాదు గోవా వరకు మాత్రమే. పూరికి బ్యాంకాక్ తరువాత అంత ఇష్టమైన ప్లేస్ గోవా. ఆయన తీసిన సినిమాలు చాలా వరకు గోవాలో ఒకటో రెండో సీన్లు కానీ, పాటలు కానీ షూట్ చేసుకున్నవే. ఒకరకంగా బ్యాంకాక్ తో పాటు గోవా కూడా సెంటిమెంట్ అని చెప్పాలి.

అందుకే ఈసారి ఆయన గోవా వెళ్తున్నారు. వెళ్లి ఓ వారం పదిరోజులు వుండి, బౌండ్ స్క్రిప్ట్ బరువుతో తిరిగి వస్తారని తాజా సమాచారం. ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా చేస్తున్న విజయ్, ఆ తరువాత 'హీరో' సినిమాను ఫినిష్ చేసి, పూరి జగన్నాధ్ తో రెడి అవుతాడు. ముందు రెండు సినిమాలు హిట్టిచ్చినా ఇవ్వకపోయినా విజయ్  పూరి సినిమా మీదే ఆశలన్ని పెట్టుకున్నాడు. రీసెంట్‌గా వచ్చిన డియర్ కామ్రేడ్ విజయ్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమా గనక హిట్ అయితే విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. అసలు పూరి కి దొరికే ఛాన్స్ కూడా ఉండేది కాదు. కాని కామ్రేడ్ ఇచ్చిన రిజల్ట్ తో విజయ్ డైలమాలో పడ్డాడు. అందుకే పూరికి ఒకే చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: