తెలుగు సినిమాల్లో కామెడీకి అగ్ర తాంబూలం ఇస్తారు. కామెడీ లేకపోయినా, కమెడియన్లు సినిమాలో లేకపోయినా సినిమా టాక్ లో తేడా వచ్చేస్తుంది మన సినిమాల్లో. కమెడీకి మన తెలుగు ప్రేక్షకులు మహరాజ పోషకులు. తెలుగు సినిమాల్లో బ్రహ్మీ వెలుగు అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా కామెడీని ఓ కమెడియన్ గా అప్రతిహతంగా పాతికేళ్లకు పైగా ఏలిన వ్యక్తి బ్రహ్మానందం. అటువంటి బ్రహ్మీకి ఓ మూడేళ్లుగా సినిమాల్లో వెలుగు తగ్గింది.

 


ఇటివల అవకాశాలు తగ్గిన బ్రహ్మానందం అడపాదడపా సినిమాలు చేసినా అవి వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నాయి. బ్రహ్మీ ఉంటే సినిమా సగం హిట్ అనే నమ్మకం అందరిలో. త్రివిక్రమ్, శీను వైట్ల, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి, పూరి జగన్నాధ్.. వంటి దర్శకులు ఆయన కోసం సృష్టించిన క్యారెక్టర్లు అలాంటివి. ఎన్నో సినిమాలు ఆయన కామెడీతో గట్టెక్కినవి ఉన్నాయి. మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న వాల్మీకి సినిమాలో బ్రహ్మీకి ఓ క్యారెక్టర్ ఇచ్చాడట దర్శకుడు హరీశ్ శంకర్. ఈ సినిమాలో ఆయనకు ఇచ్చిన క్యారెక్టర్ హైలైట్ అయితే మళ్లీ బ్రహ్మీ కోసం క్యూలు కట్టాల్సిందే. వాల్మీకితో బ్రహ్మీ తనకు తగ్గ పాత్రతో మెరిపిస్తాడేమో చూడాల్సిందే. బ్రహ్మీ సినిమాలో కనిపిస్తేనే నవ్వు వచ్చేస్తుంది. అలాంటిది సరైన క్యారెక్టర్ పడితే ఆయన టైమింగ్ తో ఆ సీన్లను, సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు.

 


నిజానికి బ్రహ్మీకి అవకాశాలు తగ్గాయని అనుకుంటున్నా.. ఆయన వయసురీత్యా సినిమాలు చేయటంలేదని సమాచారం. ఈమధ్య ఆయన హార్ట్ అపరేషన్ కూడా చేయించుకున్నారు. గతంలో అయితే ఆయన కాల్షీట్స్ దొరకటమే దర్శక-నిర్మాతలకు వరం. ఇప్పుడు ఎంతోమంది కమెడియన్లు వస్తున్నా బ్రహ్మీ స్టైల్ వేరు. గత స్థాయిలో కాకపోయినా రచయితలు ఆయన వయసుకు తగ్గ హుందా కామెడీ చేయిస్తే బాగుంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: