మెగా స్టార్ చిరంజీవి రాజకీయ జీవితం గురించి ఫిలిం ఇండస్ట్రీలోని వ్యక్తులు ఎవరు కామెంట్స్ చేసే సాహసం చేయరు. అయితే దీనికి భిన్నంగా కన్నడ హీరో సుదీప్ చిరంజీవి రాజకీయ జీవితం గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సుదీప్ నటించిన ‘పహిల్వాన్’ మూవీ ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసాడు. 

చిరంజీవి లాగే కన్నడ రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా అంటూ ఆ మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సుదీప్ విచిత్రమైన కామెంట్స్ చేసాడు. చిరంజీవి రాజకీయ జీవితం చూసిన తరువాత తాను ఎట్టి పరిస్థితులలోను రాజకీయాలలోకి రాకూడదని తీసుకున్న స్థిర నిర్ణయాన్ని వివరించాడు. 

చిరంజీవి రాజకీయాల బాట పట్టి తన జీవితంలోని విలువైన 10 సంవత్సరాల కాలాన్ని వృథా చేసుకున్నాడని అలాంటి ప్రయోగం తాను చేయను అంటూ సుదీప్ కామెంట్ చేసాడు. అంతేకాదు చిరంజీవి మెగా స్టార్ కాబట్టి నటనకు 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా జనం చిరంజీవిని ఆరాధిస్తూ ఆయన నటించిన సినిమాలకు భారీ విజయాన్ని ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి స్టామినా తనకు లేదు అంటూ కామెంట్స్ చేసాడు. 

ప్రస్తుతం సుదీప్ ‘సైరా’ లో కూడ చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో ప్రతి సీన్ కోసం చిరంజీవి పడే తపన చూసి తాను ఏ విషయంలోనూ చిరంజీవి ముందు సరిపోను అన్న అభిప్రాయానికి వచ్చిన విషయాలను వివరించాడు. అయితే చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడ రాజకీయాలలోకి వచ్చి తన విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్న సందర్భంలో సుదీప్ కామెంట్స్ బట్టి పవన్ తన నిర్ణయాలలో ఏమైనా మార్పులు చేసుకుంటాడేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: