టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ అంటే ఇలా ఉంటాడా..రెపిస్టు అంటే ఇంత కఠినంగా ఉంటారా అన్నదానికి ఉదాహారణగా ఉండేవారు చలపతిరావు.  ఎన్నో సినిమాల్లో హీరోయిన్లను వెంటాడి రేప్ చేసే సీన్లలో చలపతిరావు ఎక్కువగా కనిపించేవారు. ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లతో నటించిన ఆయన వారి వారసులతో కూడా ఎన్నో సినిమాల్లోనటించారు.  ప్రస్తుతం విలన్ వేషాలు పూర్తిగా మానివేసి తాతయ్య పాత్రల్లో నటిస్తున్నారు.  అందుకు తగ్గ ఆహార్యం కూడా ఆయనకు ఉండేది.  ఒకప్పుడు చలపతిరావు రోడ్డుపై కనిపించినా..మరెక్కడైనా కనిపించినా ఆడవాళ్లు భయపడిపోయేవారని ఆయనే పలు సందర్భాల్లో చెప్పేవారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నారు చలపతిరావు. 

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ తో తనకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో సినిమాల్లో నటించడం కత్తిమీద సాములాంటిది..ఏ చిన్న పొరపాటు చేసినా ఛాన్సులు ఉండేవి కావు.  నటుడిగా నన్ను ఎన్టీ రామారావుగారు ఎంతగానో ప్రోత్సహించారు.  ఒకే పౌరాణిక మూవీలో నాతో మూడు .. నాలుగు వేషాలు వేయించిన సందర్భాలు వున్నాయి. సినిమాల్లో నటిస్తూ కాస్త డబ్బు సంపాదించాడు..దాంతో చెన్నైలో ఒక ఇల్లుకట్టుకున్నాను. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇల్లు కట్టిన విషయం ఆయనకి చెప్పి, గృహప్రవేశానికి మీరే ముహూర్తం పెట్టాలి అన్నాను.

ముహూర్తాలు పెట్టడం రామారావుగారికి బాగా తెలుసు. ఆయన పెట్టే ముహూర్తానికి మంచి బలం ఉంటుంది..మొత్తానికి ఆ ముహూర్తానికి గృహ ప్రవేశం చేశాను.  అయితే గృహ ప్రవేశానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ రాగలరా?అనుకున్నాను. కానీ ఆయనకు నాపై ఉన్న అభిమానంతో గృహ ప్రవేశానికి వచ్చారు..మమ్ముల్ని దీవించారు. నేను ఇల్లు కట్టుకున్నందుకు ఎంతో సంతోషపడ్డారు. ఆ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పి ఆనందపడ్డారు అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: